AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Fever: వైరల్ ఫీవర్ రవొద్దంటే వీటిని తింటే చాలు.. ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్

ప్రస్తుతం ఎక్కడ చూసినా వర్షాలే.. నాలుగైదు రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరో నాలుగు రోజుల వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇప్పటికే పడిన వర్షాలకు అంటువ్యాధులు వస్తున్నాయి. జలుబు, జ్వరంతో రోగులు ఆసుపత్రులకు..

Viral Fever: వైరల్ ఫీవర్ రవొద్దంటే వీటిని తింటే చాలు.. ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్
Viral Fever
Chinni Enni
|

Updated on: Jul 26, 2023 | 6:15 PM

Share

ప్రస్తుతం ఎక్కడ చూసినా వర్షాలే.. నాలుగైదు రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరో నాలుగు రోజుల వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇప్పటికే పడిన వర్షాలకు అంటువ్యాధులు వస్తున్నాయి. జలుబు, జ్వరంతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇప్పుడొచ్చే వాటిల్లో వైరల్ ఫీవర్ ప్రధానమైనది. వైరల్ ఫీవర్ వచ్చినవారు ఏ ఆహారం తీసుకోవాలి. ఏయే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరల్ ఫీవర్ ను తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.

-వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అందుకు కొన్ని ఆహార పదార్థాలను డైట్ లో తీసుకోవాలి.

-జ్వరం ఉన్నప్పుడు మజ్జిగ అన్నం, బ్రెడ్ తినాలని చెబుతుంటారు కానీ.. వాటి వల్ల నీరసం తగ్గదు.

ఇవి కూడా చదవండి

-వైరల్ ఫీవర్ ఉన్నవారు ఎక్కువగా వెజిటబుల్ జ్యూస్ లు తాగాలి. వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

-వాటిలోనే అల్లం, వెల్లుల్లి కూడా కలుపుకుని తీసుకుంటే.. నాలుకకు మంచి రుచిని ఇవ్వడంతో పాటు వికారాన్ని తగ్గిస్తాయి.

-చికెన్ సూప్.. వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు చికెన్ సూప్ తాగడం వల్ల శరీరానికి లవణాలతో పాటు పోషకాలు కూడా లభిస్తాయి.

-తక్షణ శక్తిని పొందేందుకు అరటిపండ్లను ఆహారంగా తీసుకోవడం ఉత్తమం.

-బ్రోకలి, కివీ పండ్లను తినాలి. వీటిలో విటమిన్ సి, ఈ, కాల్షియం, ఫైబర్లు అధికంగా ఉంటాయి. బలహీనంగా ఉన్న శరీరానికి శక్తిని అందిస్తాయి.

-అలాగే వీలైనంత వరకూ కాచి, చల్లార్చిన నీటినే తరచూ తాగుతూ ఉండాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..