AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Washing Machine Tips: మీరు వాషింగ్ మెషిన్ యూజ్ చేస్తున్నారా.. అయితే దాన్ని ఇలా శుభ్రంగా ఉంచుకోవాల్సిందే!

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో బట్టలు ఉతికేందుకు చాలా మంది వాషింగ్ మెషిన్ నే ఉపయోగిస్తున్నారు. అయితే కేవలం వాషింగ్ మెషిన్ లో ఉతకడమే కాకుండా.. దాన్ని శుభ్రంగా ఉంచడాన్ని పెద్దగా పట్టించుకోరు. వాషింగ్ మెషిన్ కి కూడా శుభ్రత అవసరమా అంటే..

Washing Machine Tips: మీరు వాషింగ్ మెషిన్ యూజ్ చేస్తున్నారా.. అయితే దాన్ని ఇలా శుభ్రంగా ఉంచుకోవాల్సిందే!
washing machine clen
Chinni Enni
|

Updated on: Jul 27, 2023 | 10:10 PM

Share

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో బట్టలు ఉతికేందుకు చాలా మంది వాషింగ్ మెషిన్ నే ఉపయోగిస్తున్నారు. అయితే కేవలం వాషింగ్ మెషిన్ లో ఉతకడమే కాకుండా.. దాన్ని శుభ్రంగా ఉంచడాన్ని పెద్దగా పట్టించుకోరు. వాషింగ్ మెషిన్ కి కూడా శుభ్రత అవసరమా అంటే.. అవసరమే. దాన్ని క్లీన్ గా నీట్ గా ఉంచుకుంటే.. చాలా కాలం మన్నికగా వస్తుంది. అలాగే దుమ్ము ధూళి, మురికి పేరుకుపోయి పాడవకుండా ఉంటుంది. మరి వాషింగ్ మెషిన్ ను జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి, పాడవకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెనిగర్, బేకింగ్ సోడాతో వాషింగ్ మెషిన్ ని క్లీన్ చేసుకుంటే.. శుభ్రంగా ఉంటుంది. ఒక కప్పు వెనిగర్, కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఆ మిశ్రమాన్ని వాషింగ్ మెషీన్ లోని డిటర్జెంట్ బాక్స్ లో వేసుకోవాలి. మెషీన్ బట్టలేమీ వేయకుండా 5-10 నిమిషాల పాటు రన్ చేశాక.. ఆఫ్ చేసుకోవాలి. వాటర్ డ్రైన్ అయ్యాక.. శుభ్రమైన క్లాత్ తీసుకుని లోపల డ్రమ్ శుభ్రం చేసుకోవాలి.

అలాగే ఫ్రంట్ టోర్ వాషింగ్ మెషిన్లు అయితే.. డోర్ వద్ద ఆగిన నీటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పాచి పట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత డోర్ ఓపెన్ చేసి కాసేపు అలా వదిలేయాలి. ఇలా చేస్తే లోపల తడిపోయి పొడిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఫిల్టర్ విషయానికొస్తే.. ఇది తేమతో కూడి ఉంటుంది కాబట్టి.. దీనిలో కూడా పురుగులు వస్తాయి. దీనికి ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంచాలి. లోపలి చెత్త తీసేయాలి. లోపల జమ అయిన మురికిని అంతా తీసేయాలి.

ఈ చిట్కాలు కూడా పాటిస్తే వాషింగ్ మెషిన్ జాగ్రత్తగా చూసుకోవచ్చు. వాషింగ్ మెషిన్ ను గోడకు దగ్గరగా పెట్టకూడదు. దీని వల్ల వెనుక ఉండే పైపులు దెబ్బతింటాయి. వాషింగ్ మెషిన్ పైపులు లీకేజీ లేకుండా చూసుకోవాలి. వాషింగ్ మెషిన్లకు పౌడర్లకు బదులు లిక్విడ్ డిటర్జెంట్లు వాడితే మంచింది పౌడర్లు వాడటం వల్ల అవి మెషిన్ లో పేరుకుపోయే అవకాశాలు ఉంటాయి. వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతికిన తర్వాత డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. దీని వల్ల లోపల తేమ పోయి పొడిగా మారుతుంది. దీని వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్