Brahmamudi జులై 27వ తేదీ ఎపిసోడ్: స్వప్న చేసిన యాడ్.. దుగ్గిరాల ఇంట్లో జరిగిన యుద్ధం.. ఇచ్చిపడేసిన కనకం

స్వప్న గారిని ఇంటర్వ్యూ చేయాలి సార్ అంటారు. ఇంతలో స్వప్న రెడీ అయి.. నవ్వుకుండా బయటకి వెళ్లబోతే.. అపర్ణ ఆపుతుంది. ఏయ్ ఆగు.. ఏంటి ఇదంతా.. అంటుంది. అక్కా ఏంటి ఇదంతా.. ఏంటి నువ్వు చేసిన పని.. అని కావ్య అంటుంది. నేను ఏం చేయాలనుకున్నానో అదే చేశాను.. అదే జరుగుతుంది. అక్కా అక్కడ అంతా గందరగోళంగా ఉంది. నువ్వు వెళ్లి ఏం మాట్లాడతావ్ అని అంటుంది కావ్య. నాకు పాపులారిటీ రావడం..

Brahmamudi జులై 27వ తేదీ ఎపిసోడ్: స్వప్న చేసిన యాడ్.. దుగ్గిరాల ఇంట్లో జరిగిన యుద్ధం.. ఇచ్చిపడేసిన కనకం
Brahmamudi Serial
Follow us
Chinni Enni

|

Updated on: Jul 27, 2023 | 10:56 PM

బ్రహ్మముడి గురువారం రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగింది. దుగ్గిరాల ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. స్వప్నను ఇంట్లో నుంచి గెంటేయడానికి రాహుల్-రుద్రాణి ప్లాన్ చేస్తూంటారు. ఈ లోపు స్వప్న చేసిన యాడ్ రాహుల్ ఫోన్ కి వస్తుంది. దాన్ని రాహుల్ రుద్రాణికి చూపించి.. స్వప్నను ఇరికించడానికి ఇదే సరైన సమయం అని.. మీడియాకి ఫోన్ చేసి మరీ ఇంటికి రప్పిస్తాడు. మరోవైపు స్వప్న కోసం స్వీట్లు, చీర, సారె రెడీ చేస్తుంది కనకం. అలానే పిల్లలు ఇద్దరితో వరలక్ష్మీ వ్రతం చేయించడానికి పెద్దాయనను మీరే ఎలాగైనా ఒప్పించాలని చెబుతుంది. అయినా నీకు కావ్య అక్క డబ్బు పంపిస్తుంది.. అనగానే తెలుగింటి పండగలన్నీ గుర్తొచ్చినట్లున్నాయ్ అంటూ అప్పు. నాకు తెలుసులేవే ఇది పండగ కాదు అమ్మవారి మొక్కు అంటుంది కనకం. ఏది అయితే ఏముంది ఖర్చు పెట్టడానికి అంటుంది అప్పు.

ఇలా నడుస్తుండగా.. సరే ప్యాకింగ్ అంతా అయిపోయింది కదా.. ఆటో పంపిస్తాను.. వెళ్లిరండి అంటుంది అప్పు. అదేంటి నువ్వు రావడం లేదా.. అని కనకం అడిగితే అదేమైనా కావ్య అక్కనా.. స్వప్నే కదా దానికి మీరు వెళ్లడమే ఎక్కువ నేను ఎందుకు అని అప్పు వెళ్లిపోతుంది. ఆ సీన్ కట్ చేస్తే.. ఫోన్ లో స్వప్న చేసిన యాడ్ చూస్తాడు రాజ్. ఏయ్ ఇదిలో ఇది చూడు.. అని కావ్యకి ఇస్తాడు. రాజ్, కావ్యలు పై నుంచి కిందికి దిగుతుండగా.. ఇంటికి సడన్ గా మీడియా రావడంతో కుటుంబ సభ్యులంతా షాక్ కి గురవుతారు. ఈలోపు మీడియా స్వప్నను ఇంటర్వ్యూ చేయాలని గొడవ చేస్తారు. ఇంత జరుగుతుంటే మీ అక్క మొగుడు ఏం చేస్తున్నాడు.. అని రాజ్ కోపంగా వెళ్తాడు. మరోవైపు మీడియా వాళ్లంతా ఇంటి ముందు నిల్చుంటారు. రుద్రాణి చోద్యం చూస్తూ ఉంటుంది. అత్తయ్య.. ఏం జరిగి ఉంటుంది.. ప్రెస్ వాళ్లు ఎందుకు వచ్చారు? అని అయోమయంగా అంటుంది అపర్ణ. నాకు కూడా అదే అర్థం కావడం లేదు అపర్ణ అని ఇందిరాదేవి అంటుంది. ఏం కావాలి మీకు.. అని మీడియాను రాజ్ అడుగుతాడు.

స్వప్న గారిని ఇంటర్వ్యూ చేయాలి సార్ అంటారు. ఇంతలో స్వప్న రెడీ అయి.. నవ్వుకుండా బయటకి వెళ్లబోతే.. అపర్ణ ఆపుతుంది. ఏయ్ ఆగు.. ఏంటి ఇదంతా.. అంటుంది. అక్కా ఏంటి ఇదంతా.. ఏంటి నువ్వు చేసిన పని.. అని కావ్య అంటుంది. నేను ఏం చేయాలనుకున్నానో అదే చేశాను.. అదే జరుగుతుంది. అక్కా అక్కడ అంతా గందరగోళంగా ఉంది. నువ్వు వెళ్లి ఏం మాట్లాడతావ్ అని అంటుంది కావ్య. నాకు పాపులారిటీ రావడం నాకు నచ్చదని నీకు నచ్చదని నాకు బాగా తెలుసు.. అంటుంది స్వప్న. రాజ్ మీడియా వాళ్లకి చెప్పి వెళ్లిపోమని చెబుతుంటే స్వప్న వచ్చేస్తుంది. ఈలోపు మీడియా వాళ్లు.. మేడమ్ ఈ యాడ్ ఎలా చేయగలిగారని అడుగుతారు.

ఇవి కూడా చదవండి

ఇంతలో సీతారామయ్య అక్కడికి వచ్చి రాజ్ ఏం జరుగుతుంది? ఇక్కడ అడుగుతాడు. ఈ లోపు సీతారామయ్యను కళ్యాణ్ లోపలికి తీసుకువెళ్లి ఉండండి.. నేను చూపిస్తాను అని ఆ యాడ్ టీవీలో వేసి చూపిస్తాడు. ఆ యాడ్ ని చూసి ఇంట్లో వాళ్లంతా అసహ్యించుకుంటారు. ఈ లోపు రుద్రాణి-రాహుల్ పక్కకు వెళ్లి ఇదంతా నువ్వే వెనకుండి నడిపించావని పాపం ఎవరికీ తెలీదు.. అని రాహుల్‌తో రుద్రాణి అంటుంది. ఈ తింగరి మొహంది ఏం మాట్లాడుతుందో దానికే తెలీదు అంటాడు రాహుల్. మీరు దుగ్గిరాల వారి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలు అయి ఉండి ఇంత బోల్డ్ కంటెంట్‌ లో ఎలా యాక్ట్ చేశారండి.. అని మీడియా అడుగుతుంది.

మోడలింగ్ అనేది చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన ఫీల్డ్.. అందుకే నా గ్లామర్ కాపాడుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు అవకాశం దొరికింది.. ఒళ్లు దాచుకోకుండా కష్టపడుతున్నాను.. అంటుంది స్వప్న. ఇంతలో కలకం, కృష్ణమూర్తి అక్కడి వస్తారు. ఏంటి? ఏదో హడావిడిగా ఉంది.. అనుకుంటూంటారు. మీడియా.. స్వప్నని ప్రశ్నించడం చూస్తారు. ఈలోపు మీడియా వాళ్లు ఇలాంటి ఎక్స్‌పోజింగ్ యాడ్‌ లో నటించడం మీ నిర్ణయమేనా? ఇంట్లో వాళ్ల ప్రోత్సాహం ఏమైనా ఉందా? అడుగుతారు. ఇదంతా నా స్వయం కృషి.. వాళ్ల ప్రోత్సాహం గురించి నేను ఎప్పుడూ ఎదురుచూడలేదు.. నాకు నచ్చిన రంగం ఎంచుకునే హక్కు నాకు ఉంది కదా.. అంటుంది స్వప్న. ఇంతలో స్వప్నను బలవంతంగా వెనక్కి లాగేస్తుంది కావ్య.. దయచేసి మీరు ఇంతటితో వెళ్లిపోండి అని మీడియాకి చెప్పేస్తుంది.

కనకం-కృష్ణమూర్తికి ఏం జరుగుతుందో అర్థం కాక గడప దగ్గర నిల్చుంటారు. ఇక లోపల పంచాయితీ మొదలవుతుంది. అందరూ స్వప్న వైపు కోపంగా చూస్తారు. రేయ్ రాహుల్ స్వప్న అంటే బయటి నుంచి వచ్చింది.. నువ్వు ఈ ఇంట్లోనే పుట్టి పెరిగావ్ కదా.. ఇదంతా ఇంటికి ఎందుకు తీసుకువచ్చావ్.. అని రాజ్ ఫైర్ అవుతాడు. వెంటనే స్వప్న మాట్లాడుతూ.. ఇందులో రాహుల్ చేసిందేమీ లేదు.. మొత్తం నేనే చేశాను.. అవకాశం నేనే వెతుక్కున్నాను.. మీడియాలో వచ్చేవరకు అందరినీ సస్పెన్స్‌ లో ఉంచి సర్‌ప్రైజ్ చేయాలనుకున్నా అని అంటుంది. నువ్వు ఏది పడితే అది చేస్తే అది ఈ కుటుంబం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఆలోచించావా.. అంటుంది అపర్ణ. ఇలాంటి యాడ్ ఒకటి చేస్తున్నానని చెబితే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు, మీడియాలో మా పరువు పోయిండేది కాదు.. అని సుభాష్అంటాడు.

పరువు పోయింది ఏముందండి.. వాళ్లు నన్ను, నా ధైర్యాన్ని పొగిడారు కదా.. ఒక సెలబ్రెటీలాగే నన్ను ట్రీట్ చేశారు కదా.. అంటుంది స్వప్న. నీకు ఈ ఇంటి సంప్రదాయాలు తెలీదా.. కడుపుతో ఉన్న కోడలు ఏం చేస్తుందో ఎక్కడికి వెళ్తుందో పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదా.. అని ఇందిరాదేవి అడుగుతుంది. ఆ తర్వాత రుద్రాణి మీద అరుస్తుంది ఇందిరా దేవి. దీనికి రుద్రాణి రియాక్ట్ అవుతూ.. అనుకున్నాను.. మీరంతా ఈ సుందరాంగిణి వదిలేసి నన్ను అంటారని ఫైర్ అవుతుంది. ఇలాంటి దానికి మన కుటుంబంలో ఉండే అర్హతే లేదు.. గెంటిపారేయండి.. దరిద్రం వదిలిపోతుంది.. అని రుద్రాణి డ్రామా ఆడుతుంది.

ఏంటి ఇదంతా.. మీరంతా నేను ఏదో నేరమో, ఘోరమో చేసినట్లు అంతా అలా మాట్లాడుతున్నారు.. ఇది కూడా ఒక ప్రొఫెషనే.. అవసరాన్ని బట్టి డైరెక్టర్ చెప్పినట్లు బట్టలు వేసుకోవాల్సి ఉంటుందని చెబుతుంది స్వప్న. ఆ తర్వాత కావ్య కూడా స్వప్నకు గట్టిగా ఇచ్చిపడేస్తుంది. ఒకే కుటుంబం నుంచి వచ్చిన అక్కా చెల్లెళ్లల్లో ఎంత తేడా ఉందో అర్థమవుతుంది.. చెల్లెలేమో ఇంటి పరువు గురించి ఆలోచిస్తుంది.. అక్కేమో ఇంటి పరువును పోగొడుతుంది.. అని ఇందిరాదేవి అంటుంది.

ఇక స్వప్న ఓవరాక్షన్ భరించలేక కనకం ఎంట్రీ ఇస్తుంది. స్వప్న.. అని అరిచి దగ్గరికి వచ్చి కూతూరిపై చేయి ఎత్తుతుంది. కానీ కొట్టకుండా ఆగిపోతుంది. తల్లి కాబోతున్న కూతురి మీద చేయి చేసుకోవడం ఇష్టం లేక ఆగుతున్నా.. ఏమైందే నీకు.. ఏ దెయ్యం పూనింది.. ఎవరితో ఏం మాట్లాడుతున్నావ్.. ఇక్కడికి ఎలా వచ్చావో మర్చిపోయావా.. నీ పుట్టుక ఏంటో, నీ స్థాయి ఏంటో, అసలు నువ్వు చేసిన నీతి మాలిన పనేంటో అవన్నీ నీకు గుర్తులేవా.. అని కనకం కడిగిపారేస్తుంది. ఇక్కడితో గురువారం ఎపిసోడ్ ముగుస్తుంది.