Sweet Corn Soup: రెస్టారెంట్ స్టైల్ లో స్వీట్ కార్న్ సూప్.. ఇంట్లోనే ఇలా తయారుచేసుకోండి

వర్షాలు దండిగా పడుతున్నాయి. వెదర్ చాలా కూల్ కూల్ గా ఉంది. ఇలాంటి సమయంలో ఒక సూప్ తాగితే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. అలా ఓ మంచి రెస్టారెంట్ కు వెళ్లి.. వేడి వేడిగా ఒక సూప్ తాగాలని అనిపిస్తుంది కదూ. కానీ బయటకు వెళ్లలేని...

Sweet Corn Soup: రెస్టారెంట్ స్టైల్ లో స్వీట్ కార్న్ సూప్.. ఇంట్లోనే ఇలా తయారుచేసుకోండి
Sweet Corn Soup
Follow us

|

Updated on: Jul 26, 2023 | 10:17 PM

వర్షాలు దండిగా పడుతున్నాయి. వెదర్ చాలా కూల్ కూల్ గా ఉంది. ఇలాంటి సమయంలో ఒక సూప్ తాగితే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. అలా ఓ మంచి రెస్టారెంట్ కు వెళ్లి.. వేడి వేడిగా ఒక సూప్ తాగాలని అనిపిస్తుంది కదూ. కానీ బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇంట్లోనే ఎంచక్కా వేడి వేడిగా ఒక స్వీట్ కార్న్ సూప్ తయారు చేసుకోవచ్చు. జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటుంది. అలాగే ఆకలి కూడా ఎక్కువగా ఉండదు. మరి ఈ సూప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి.

స్వీట్ కార్న్ సూప్ తయారీకి కావలసిన పదార్థాలు:

స్వీట్ కార్న్ – పావుకప్పు నీళ్లు – అరలీటర్ తరిగిన క్యారెట్ – చిన్నది తరిగిన క్యాబేజీ – 3 టేబుల్ స్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా వెనిగర్ – 1 టీ స్పూన్ మిరియాలపొడి – అర టీ స్పూన్ పంచదార – అర టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ – 3 టేబుల్ స్పూన్లు

ఇవి కూడా చదవండి

ఒక మిక్సీ జార్ లో స్వీట్ కార్న్ వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) తీసుకుని కొద్దిగా నీరు పోసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో అరలీటర్ నీరు పోసి వేడి చేశాక.. అందులో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన స్వీట్ కార్న్, తరిగిన క్యారెట్, క్యాబేజీతో పాటు మరో రెండుస్పూన్ల ట్వీట్ కార్న్ గింజలు వేసి ఒక పొంగు వచ్చే వరకూ ఉడికించాలి. పైన ఏర్పడిన నురుగను తీసేసి 8 నిమిషాలపాటు ఉడికించుకోవాలి.

తర్వాత పైన చెప్పిన క్వాంటిటీలో వెనిగర్, మిరియాలపొడి, పంచదార, ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని అందులో వేసి కలపాలి. అది కొంచెం చిక్కబడేలా ఉడికించాక స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే.. వేడి వేడి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ సూపర్ రెడీ.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి