Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Education Policy: ప్రధాని మోదీకి చిన్నారుల చిరు సందేశం.. వీడియోను షేర్ చేసిన కేంద్ర విద్యా మంత్రి..

National Education Policy 2020: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జాతీయ విద్యా విధానం-2020’కి నేటితో 3 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి చిన్నారి విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేస్తున్న ఓ వీడియోను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేశారు. ‘మా భవిష్యత్తును నిర్మిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు’ అంటూ..

National Education Policy: ప్రధాని మోదీకి చిన్నారుల చిరు సందేశం.. వీడియోను షేర్ చేసిన కేంద్ర విద్యా మంత్రి..
Children's Message to PM Modi
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 28, 2023 | 6:59 PM

National Education Policy 2020: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జాతీయ విద్యా విధానం-2020’కి నేటితో 3 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి చిన్నారి విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేస్తున్న ఓ వీడియోను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేశారు. ‘మా భవిష్యత్తును నిర్మిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు’ అంటూ ఆ వీడియోలోని పలువురు చిన్నారులు పేర్కొన్నారు. ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ ‘ఈ చిన్నారుల కలలు, వారిలోని ప్రతిభ మిమ్మల్ని కూడా ఆనందింపజేస్తాయి. జాతీయ విద్యా విధానానికి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీకి చిన్నారుల సందేశం’ అంటూ రాసుకొచ్చారు.

కాగా, ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ‘జాతీయ విద్యా విధానం-2020’ని 2020 జూలై 19 నుంచి అమలుపరుస్తోంది. దీని ద్వారా గతంలోని 10+2 పాఠశాల విద్యా విధానానికి బదులుగా 5+3+3+4 విధానం అమలులోకి వచ్చింది. అంటే అంతకముందు ఉన్న 1 నుంచి 10వ తరగతి+ఇంటర్మీడియట్ స్థానంలో.. ఫౌండేషన్ స్టేజ్(అంగన్‌వాడీ విద్య& 1,2 తరగతులు.. అధ్యయనాల దృష్టి కార్యాచరణ-ఆధారిత అభ్యాసం), ప్రిపరేటరీ స్టేజ్(3 నుంచి 5వ తరగతి.. మాట్లాడటం, చదవడం, రాయడం, శారీరక విద్య, భాషలు, కళ, సైన్స్, గణిత శాస్త్రాల పరిచయం), మిడిల్ స్టేజ్(6 నుంచి 8వ తరగతి..గణితం, శాస్త్రాలు, సాంఘిక శాస్త్రాలు, కళలు, మానవీయ శాస్త్రాలలో మరింత వియుక్త భావనల పరిచయం), సెకండరీ స్టేజ్(9 నుంచి 12వ తరగతి..  క్రిటికల్ థింకింగ్‌, మల్టీడిసిప్లినరీ స్టడీ) వంటి దశలుగా విద్యార్థులు విద్యనభ్యసిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.