- Telugu News Photo Gallery Cricket photos Who is Going to be Rohit Sharma's Opening Partner vs West Indies ODI Series, check here for details
IND vs WI: రోహిత్ కెప్టెన్సీకి మరో పరీక్ష..! ఆ స్థానం కోసం నలుగురు ప్లేయర్లు పోటాపోటీ.. లిస్టులో ఇద్దరు డబుల్ సెంచరీ వీరులు..
IND vs WI ODI Series: గురువారం రాత్రి 7 గంటలకు భారత్, వెస్టిండీస్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగబోతుంది. అయితే అంతకంటే ముందే రోహిత్ శర్మ ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే రోహిత్‌తో కలిసి వన్డే ఇన్నింగ్స్‌ను ప్రారంభించే ఓపెనర్ ఎవరనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Updated on: Jul 27, 2023 | 1:03 PM

IND vs WI: రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు గురువారం నుంచి వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో తలపడబోతుంది. అయితే టీమ్ కెప్టెన్‌గా రోహిత్‌కు ఇప్పుడు ఓ కష్టం వచ్చిపడింది. అదేమింటంటే.. భారత్ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ను తనతో కలిసి ప్రారంభించేందుకు రోహిత్ ఓ అనుభవ ప్లేయర్‌ని ఎంచుకోవాలి. అయితే ఓపెనింగ్ స్థానం కోసం ఇప్పుడు టీమ్‌లో నలుగురు ప్లేయర్లు ఉన్నారు. మరివారిలో రోహిత్ ఎవరిని ఎంచుకుంటాడో..

రోహిత్ శర్మతో కలిసి భారత్‌కి శుభారంభం అందించగల ప్లేయర్ల లిస్టులో శుభమాన్ గిల్ పేరు ముందుగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పుటివరకు 9 వన్డేలు ఆడిన గిల్ 78 సగటుతో 624 పరుగులు చేశాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లో కూడా గిల్ 3 సెంచరీలతో తనదైన ముద్ర వేశాడు. ఇంకా న్యూజిలాండ్‌పై గిల్ వన్డే డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రోహిత్‌తో జత కట్టేందుకు శుభమాన్ గిల్‌కి అవకాశం ఉంది.

వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం దక్కలేదు. కానీ వన్డే జట్టులో స్థానం పొందిన రుతురాజ్. ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్‌గా మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌కి జోడిగా రుతురాజ్ మారే అవకాశం లేకపోలేదు.

రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ కూడా ఓపెనింగ్ చేయగలడు. రోహిత్‌తో ఇషాన్ జోడిగా మారితే లెఫ్ అండ్ రైట్ కాంబినేషన్ కుదురుతుంది. పైగా బంగ్లాదేశ్‌పై ఇషాన్ ఓపెనర్‌గా వన్డే డబుల్ సెంచరీ సాధించాడు. అలాగే విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇషాన్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓపెనర్‌గా ఇషాన్‌ను ఎంపిక చేయవచ్చు. పైగా ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఇద్దరే ఓపెనర్లుగా ఆడుతున్నారు.

విండీస్‌తో జరగబోయే ఈ వన్డే సిరీస్‌తో సంజూ శాంసన్ టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా అనుభవం కలిగిన సంజూని రోహిత తన జోడిగా సెలెక్ట్ చేసుకోవచ్చు.




