Venkata Chari |
Updated on: Jul 28, 2023 | 6:47 AM
India Vs West Indies: బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. ఈ మూడు వికెట్లతో జడేజా 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ 3 వికెట్లతో వెస్టిండీస్‌పై వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్‌గా రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు.
గతంలో ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉంది. వెస్టిండీస్‌పై 42 మ్యాచ్‌లు ఆడిన కపిల్ దేవ్ 43 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.
వెస్టిండీస్‌తో జరిగిన 26 వన్డే మ్యాచ్‌లలో అనిల్ కుంబ్లే 41 వికెట్లు తీసి ఈ రికార్డు జాబితాలో 2వ స్థానంలో ఉన్నాడు.
వెస్టిండీస్‌పై రవీంద్ర జడేజా 30 వన్డేల్లో 44 వికెట్లు తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో 30 ఏళ్లుగా కపిల్ దేవ్ పేరిట ఉన్న ప్రత్యేక రికార్డును జడేజా సొంతం చేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ (4 వికెట్లు), రవీంద్ర జడేజా (3 వికెట్లు) స్పిన్ ధాటికి తడబడటంతో వెస్టిండీస్ జట్టు 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత్ 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను సాధించింది.