Cooking Tips: ఈ పదార్థాల కోసం ప్రెషర్ కుక్కర్‌ ఉపయోగించకండి.. ఇందులో వండితే ఇక అంతే సంగతి..!

Pressure Cooker: వంటగదిలో ప్రెషర్ కుక్కర్ ఉంటే సగం వంట అయిపోయినట్లేనన్న అనుభూతి కలుగుతుంది. కూర చేస్తున్న సమయంలోనే కుక్కర్‌లో అన్నం అయిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ఇది చక్కగా..

Cooking Tips: ఈ పదార్థాల కోసం ప్రెషర్ కుక్కర్‌ ఉపయోగించకండి.. ఇందులో వండితే ఇక అంతే సంగతి..!
Pressure Cooker,
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 27, 2023 | 1:53 PM

Pressure Cooker: వంటగదిలో ప్రెషర్ కుక్కర్ ఉంటే సగం వంట అయిపోయినట్లేనన్న అనుభూతి కలుగుతుంది. కూర చేస్తున్న సమయంలోనే కుక్కర్‌లో అన్నం అయిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. కానీ ప్రెషర్ కుక్కర్‌‌ని అన్ని రకాల పదార్థాల కోసం ఉపయోగించకూడదు. అన్ని రకాల ఆహారాలను కుక్కర్‌లో చేస్తే ఆరోగ్య సమస్యలు లేదా పదార్థాలు పాడయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏయే పదార్థాల కోసం కుక్కర్‌ని ఉపయోగించకూడదో ఇప్పుడు చూద్దాం..

పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, మజ్జిగ లేదా మీగడ వంటి పాల ఉత్పత్తులకు సంబంధించిన వంటకాలను ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు. కుక్కర్‌లోని అధిక వేడి కారణంగా పాల ఉత్పత్తులు దాని నుంచి పేలిపోవచ్చు, లేదా పదార్ధాలు చెడిపోవచ్చు. అలా చెడిన పదార్థాలను తీసుకున్నట్లయితే మీరు ఆనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది.

వేయించిన పదార్థాలు: ప్రెషర్ కుక్కర్‌లో వేపుళ్లను కూడా వండకూడదు. అధిక వేడి,  వేడి నూనె కారణంగా, ఆహారం చిందటం జరుగుతుంది. ఫలితంగా మీ శరీరంపై పడి గాయాలకు కారణంగా మారవచ్చు.

ఇవి కూడా చదవండి

పాస్తా, నూడుల్స్: ప్రెషర్ కుక్కర్‌లో పాస్తా, నూడుల్స్ వంటివాటిని కూడా ఉడికించకూడదు. కుక్కర్‌లోని అధిక వేడి కారణంగా అవి ముద్దగా తయారై రుచిని కోల్పోతాయి. ఇంకా వాటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఉంది.

కూరగాయలు: కూరలను చేయడానికి అధిక సమయం పడుతుంది. ఈ కారణంగా ప్రెషర్ కుక్కర్‌ని ఉపయోగించకూడదు. ఒక వేళ ఉపయోగించినట్లయితే.. ఆ కూరలోని పోషకాలు అన్ని తొలగిపోయి, తినే ఆహారం నిష్ప్రయోజకంగా మారుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?