Hyderabad: ఆ ట్రాఫిక్ పోలీస్ చలాన్ కోసం ఫొటో తీయలేదంటా.? అధికారుల వివరణ ఏంటంటే..
నాన్ స్టాప్ గా మూడు రోజుల పాటు హైదరాబాదులో వర్షాలు పడ్డాయి. ఒక్క శాఖ అని కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలు సమన్వయంతో వరదలను ఎదుర్కొనీ సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో ఒక ట్రాఫిక్ పోలీస్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈనెల 26న సైబరాబాద్ పరిధిలో భారీగా కురిసిన వర్షానికి రోడ్డంతా నీటితో నిండిపోయింది. ఈ రోడ్డుపై వందలాది వాహనాలు వస్తూ పోతూ ఉన్నాయి. ఇదే సమయంలో రోడ్డుకి పక్కన నిలుచున్న ట్రాఫిక్ కానిస్టేబుల్..

నాన్ స్టాప్ గా మూడు రోజుల పాటు హైదరాబాదులో వర్షాలు పడ్డాయి. ఒక్క శాఖ అని కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలు సమన్వయంతో వరదలను ఎదుర్కొనీ సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో ఒక ట్రాఫిక్ పోలీస్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈనెల 26న సైబరాబాద్ పరిధిలో భారీగా కురిసిన వర్షానికి రోడ్డంతా నీటితో నిండిపోయింది. ఈ రోడ్డుపై వందలాది వాహనాలు వస్తూ పోతూ ఉన్నాయి. ఇదే సమయంలో రోడ్డుకి పక్కన నిలుచున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తన చేతిలోని కెమెరా తీసి ఫోటో తీస్తూ ఉన్నాడు. అయితే అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు ఫోటో తీస్తున్న ట్రాఫిక్ పోలీస్ ను చూశారు. ఇంత వరదల్లోనూ ట్రాఫిక్ చలాన్లు వేయడమే మీ డ్యూటీ నా అంటూ ట్రాఫిక్ పోలీస్ లను ట్యాగ్ చేస్తూ ట్విట్ చేశారు… చాలామంది నెట్ జెన్స్ ఈ ఫోటోను వైరల్ చేసి సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్లో ట్యాగ్ చేయడంతో సైబరాబాద్ పోలీసులు ఈ ఫోటోపై వివరణ ఇచ్చారు.
పోలీసుల వెర్షన్ ఏంటంటే..
ఈ ఫోటో పై స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక పోస్ట్ పెట్టి వైరల్ ఆవుతున్న ఫోటో పై వివరణ ఇచ్చారు.. కెమెరా చేతులో పట్టుకోగానే ట్రాఫిక్ పోలీస్ చలానా విధిస్తున్నట్టు కాదంటూ సైబరాబాద్ పోలీసులు స్పందించారు. ఈ ఫోటో అయోధ్య జంక్షన్ నుంచి భాశ్రిగాడికి వెళ్లేదారి. ఇక్కడ పూర్తిగా వాటర్ రోడ్డుపైకి వచ్చి చేరటంతో ఆ ఫోటోను ట్రాఫిక్ కానిస్టేబుల్ కెమెరాలో బంధించాడు. వర్క్ జరిగే ముందు, వర్క్ పూర్తయిన తర్వాత ఫోటో తీశాడు.. అంతే తప్ప నెటిజన్స్ చెబుతున్నట్టు వరదల్లోనూ ట్రాఫిక్ చలానా విధించారు అనడం కరెక్ట్ కాదంటూ స్పందించారు సైబరాబాద్ పోలీసులు.
Traffic personnel in the above is not imposing any e-challan. Road connecting Ayodhya Junction and Basrigadi was submerged with rain water on the intervening night of 26/27/7/2023. A videograph was taken before the logged water was cleared and the same after the action taken.
— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) July 28, 2023
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..