Telangana: గడువులోపు ఫీజు చెల్లించని పేద విద్యార్థి… అండగా నిలుస్తూ హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణ హైకోర్టు ఒక ఐఐటీ విద్యార్థి సీటు వ్యవహారంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగూడెం పాల్వంచకు చెందిన వంశీ కళ్యాణ్ అనే పేద విద్యార్దికి కర్ణాటకలోని ఐఐటీ ధార్వాడ్ లో మెకానికల్ సీట్ వచ్చింది. అయితే జాయినింగ్ ఫీజు కట్టని కారణంగా వంశీ కళ్యాణ్‌కి కేటాయించిన సీటును రద్దు చేసింది. వేరే గత్యంతరం లేక యువకుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. మొదటి రెండు పేజీలను క్లియర్ చేసిన యువకుడు సీట్ అలాట్మెంట్ జాయినింగ్ ఫీజ్ 20000 కట్టాలి. అయితే...

తెలంగాణ హైకోర్టు ఒక ఐఐటీ విద్యార్థి సీటు వ్యవహారంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగూడెం పాల్వంచకు చెందిన వంశీ కళ్యాణ్ అనే పేద విద్యార్దికి కర్ణాటకలోని ఐఐటీ ధార్వాడ్ లో మెకానికల్ సీట్ వచ్చింది. అయితే జాయినింగ్ ఫీజు కట్టని కారణంగా వంశీ కళ్యాణ్‌కి కేటాయించిన సీటును రద్దు చేసింది. వేరే గత్యంతరం లేక యువకుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. మొదటి రెండు పేజీలను క్లియర్ చేసిన యువకుడు సీట్ అలాట్మెంట్ జాయినింగ్ ఫీజ్ 20000 కట్టాలి. అయితే పేద విద్యార్థి కావడంతో 20,000 తన దగ్గర లేకపోయినప్పటికీ వేరే వ్యక్తులు 20,000 కడతామని ముందుకు రావడంతో ఆఫ్‌లైన్ ఫీజు చెల్లించేందుకు ప్రయత్నించాడు. అయితే చివరి నిమిషంలో ఫీజు కట్టేందుకు ప్రయత్నించిన యువకుడికి టెక్నికల్ ఎర్రర్ కారణంగా పేమెంట్ కాలేదు. దీంతో ఫీజు కట్టలేదని నేపంతో విద్యార్థికి కేటాయించిన మెకానికల్ సీట్‌ను యాజమాన్యం రద్దు చేసింది. సీటు క్యాన్సిల్ అవడంతో ఏం చేయాలో అర్థం కాని విద్యార్థి న్యాయం కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు.
కొత్తగూడెం పాల్వంచ ప్రాంతానికి చెందిన వంశీ కళ్యాణ్ పేద కుటుంబానికి చెందినవాడు. ఇతని తండ్రి అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. ఎంతో కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించిన వంశీ కళ్యాణ్ పదవ తరగతిలో 10/10 తో స్కూల్ టాపర్ గా నిలిచాడు. ఇక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివిన వంశీ కళ్యాణ్ కి 97.8% మార్పులు వచ్చాయి. ఇంటర్ పూర్తి కాగానే ఐఐటీ జేఈఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసేందుకు రాత్రిo బవలు కష్టపడ్డాడు. తీవ్ర సాధన చేసిన విద్యార్థి ఐఐటి జేఈఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో 1033 ర్యాంకు సాధించాడు. ర్యాంక్ వచ్చిన వెంటనే కౌన్సిలింగ్లో ఐఐటి ధార్వార్డ్ లో మెకానికల్ సీట్ సాధించాడు.
3 స్టెప్స్ లో సీట్ కేటాయింపు జరుగుతుంది. కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన సీటును యాక్సెప్ట్ చేస్తున్నట్టు విద్యార్థి యాక్సెప్ట్ చేయాలి.. సంబంధిత సర్టిఫికెట్స్ తో వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. చివరిగా సీట్ అలకేషన్ ఫీజు చెల్లించి కాలేజీలో జాయిన్ అవ్వాలి. అయితే మొదటి రెండు దఫాలు క్లియర్ చేసిన విద్యార్థి ఫీజు చెల్లించే విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. పెద్ద విద్యార్థి కావటంతో తన వద్ద 20 వేల రూపాయలు లేకపోవడంతో ఫీజు చెల్లింపు డెడ్లైన్ వరకు వేచి చూశాడు. అయితే ఫీజు చెల్లించేందుకు ఇతర వ్యక్తులు ముందుకు రావడంతో చివరి నిమిషంలో 20000 చెల్లించేందుకు ప్రయత్నించాడు.
అయితే సాంకేతిక లోపం కారణంగా విద్యార్థి చెల్లించిన ఫీజు యాజమాన్యానికి రీచ్ కాలేదు. దీంతో ఐఐటి ధార్వాడ్ లో వంశీ కళ్యాణ్ కు కేటాయించిన మెకానికల్ సీటును యాజమాన్యం రద్దు చేసింది. అయితే తెలంగాణ హైకోర్ట్ ఈ విషయం స్పందించింది. విద్యార్థి పిటిషన్ పై విచారించిన తెలంగాణ హైకోర్టు విద్యార్థికి అనుకూలంగా తీర్పునిచ్చింది. వంశీ కళ్యాణ్‌కి కేటాయించిన సీటును రిజర్వ్ చేసి, అతనిని వెంటనే జాయిన్ చేసుకోవాల్సిందిగా ఐఐటి ధార్వాడ్ కి హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..