Medical Seats: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ మెడికల్ కాలేజీలో పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు
గతంతో పోలిస్తే తెలంగాణలో భారీగా మెడికల్ సీట్లు పెరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలో భారీగా సీట్లు పెరిగాయి. అయితే అదే విధంగా పలు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ ఎంబీబీఎస్ సీట్లలో పెరుగుదల కనిపించింది. ఇప్పటికే పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో గణనీయంగా సీట్లు పెరగగా తాజాగా కరీంనగర్‌లోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలోనూ మెడికల్ సీట్లను పెంచుతూ...
గతంతో పోలిస్తే తెలంగాణలో భారీగా మెడికల్ సీట్లు పెరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలో భారీగా సీట్లు పెరిగాయి. అయితే అదే విధంగా పలు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ ఎంబీబీఎస్ సీట్లలో పెరుగుదల కనిపించింది. ఇప్పటికే పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో గణనీయంగా సీట్లు పెరగగా తాజాగా కరీంనగర్‌లోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలోనూ మెడికల్ సీట్లను పెంచుతూ నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయం తీసుకుంది.
కాలోజీ నారయణ రావు యూనివర్సిటీ పరిధిలోని ప్రతిమ కాలేజీ 2023-24 అకడమిక్ ఇయర్‌కు గాను 50 ఎంబీబీఎస్ సీట్లను పెంచాలంటూ మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్‌కు అనుమతి కోసం లేఖను రాయగా అందుకు బోర్డు నుంచి అనుమతి లభించింది. ప్రస్తుతం ప్రతిమ కాలేజీలో 200 సీట్లు ఉండగా 50 కొత్త సీట్లకు అనుమతి లభించిన తర్వాత మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 250కి చేరాయి. కాలేజీలో మౌలిక సదుపాయాలు బోర్డ్ పేర్కొన్న ప్రమాణాలకు తగినట్లు ఉన్న కారణంగా ఎంబీబీఎస్ సీట్లను పెంచుతూ అనుమతులు మంజూరు చేశారు.
ప్రతిమ మెడికల్ కాలేజీ విషయానికొస్తే ఈ విద్యా సంస్థను 2001లో ప్రతిమ ఎడ్యుకేషన్ సొసైటీ కింద రిజిస్టర్ చేశారు. తొలుత ఈ కాలేజీ 150 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభంకాగా తాజాగా 250కి చేరింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..