TS Govt Jos: తెలంగాణ సచివాలయంలో 23 పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు మొత్తం 23 పోస్టులను రాష్ట్రం కొత్తగా ప్రభుత్వం..
హైదరాబాద్, జులై 28: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు మొత్తం 23 పోస్టులను రాష్ట్రం కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టుల్లో 3 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, 20 భద్రతా విభాగం సిబ్బంది పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులన్నింటినీ ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ప్రకటిస్తూ గురువారం (జులై 27) ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. తాజాగా మంజూరు చేసిన ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.