అవిశ్వాస తీర్మానం సరికాదు.. విపక్షాలు కేంద్రానికి మద్ధతుగా కలిసిరావాలి.. ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇటీవల మణిపుర్‌లో జరిగిన అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వర్షకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అందులో రోజూ మణిపుర్ వివాదమే నడుస్తుంది. మణిపుర్ సమస్యపై ప్రధాని మోదీ మాట్లాడాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి.
ఇటీవల మణిపుర్‌లో జరిగిన అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వర్షకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అందులో రోజూ మణిపుర్ వివాదమే నడుస్తుంది. మణిపుర్ సమస్యపై ప్రధాని మోదీ మాట్లాడాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. కానీ అందుకు బీజేపీ తమ విమర్శలతో తిప్పికొడుతోంది. ప్రధానిని ఎలాగైన మాట్లాడించేలా చేయాలని తాజాగా విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే దీనిపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి స్పందించారు. మణిపుర్ అంశంపై విపక్షాలు కేంద్రానికి మద్ధతుగా కలిసిరావాలని కోరారు.
సరిహద్దు దేశాలు చేస్తున్న కుట్రల పట్ల అందరూ సమస్టిగా ఉండాల్సిన అవసరం ఉందని.. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని తిప్పికొట్టాలని విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి ఓ జాతీయ మీడియా చర్చలో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ ఆర్టినెస్‌పై అలాగే విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఢిల్లీ ఆర్టినెన్స్‌కు సంబంధించి మాట్లాడిన ఆయన ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రం కాదని అన్నారు. కేంద్రం తెచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ సమాఖ్య స్పూర్తిని దెబ్బ తీయడం లేదని పేర్కొన్నారు. అలాగే ఇది సుప్రీంకోర్టును తీర్పును ఉల్లంఘించడం లేదని తెలిపారు. అందుకే ఈ రెండు విషయాల పట్ల వైఎస్సార్‌సీపీ కేంద్రానికి మద్ధతిస్తుందని వెల్లడించారు.