Kodali Nani: చంద్రబాబు ప్యాకేజీకి పవన్ అమ్ముడు పోయాడు అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

కొడాలి నాని.. చిరంజీవి మాటకు క‌ట్టుబ‌డిన ముఖ్యమంత్రి.. చిరంజీవి తీసుకొచ్చిన సినీ పెద్ద‌ల‌తో సీఎం మాట్లాడారని గుర్తు చేశారు. చిరంజీవిని సీఎం జగన్  దంపతులు ఎంతో గౌర‌వంగా చూసారని పేర్కొన్నారు.

Kodali Nani: చంద్రబాబు ప్యాకేజీకి పవన్ అమ్ముడు పోయాడు అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..
Kodali Nani On Pawan
Follow us
Surya Kala

|

Updated on: Aug 23, 2022 | 1:48 PM

Kodali Nani on Pawan Kalyan: రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నా.. ఇప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ వైసీపీ నేతలు, ప్రతిపక్షపార్టీ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతుంది. నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అన్నచందంగా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎక్కడ ఏ సందర్భం వచ్చినా సీఎం జగన్ సహా వైసీపీ నేతలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు. అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ అధికార పార్టీ నేతల ఆరోపణలను తిప్పి కొడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని మళ్ళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

సినిమా టిక్కెట్ల‌పై మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ప్ర‌తిపాద‌న‌ల‌ను సీఎం జగన్ గౌర‌వంగా ఆమోదించారన్నారు కొడాలి నాని. చిరంజీవి మాటకు క‌ట్టుబ‌డిన ముఖ్యమంత్రి.. చిరంజీవి తీసుకొచ్చిన సినీ పెద్ద‌ల‌తో సీఎం మాట్లాడారని గుర్తు చేశారు. చిరంజీవిని సీఎం జగన్  దంపతులు ఎంతో గౌర‌వంగా చూసారని పేర్కొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తింద‌ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని.. చంద్ర‌బాబు ప్యాకేజి చిల్ల‌ర డ‌బ్బుల‌కు ప‌వ‌న్ అమ్ముడిపోయారని సంచలన ఆరోపణలు చేశారు కొడాలి నాని.

ప‌వ‌న్ ఓటింగ్ ను చంద్ర‌బాబుకు ఆహారంగా వేస్తాడని.. కాపుల‌ను బీసీల్లో చేరుస్తాన‌ని చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు చెప్పారు. మరి ఎందుకు అమలు చేయలేదంటూ ప్రశ్నించారు. ముద్ర‌గ‌డ ఫ్యామిలీ ప‌ట్ల చంద్ర‌బాబు దారుణంగా వ్య‌వ‌హ‌రించారన్నారు. రాష్ట్రంలో ఒక్క‌శాతం కూడా ఓటు లేని ప‌వ‌న్ కళ్యాణ్ 60 శాతం ఓట్లు ఉన్న వైసీపీ పార్టీని సీఎం జ‌గ‌న్ ను ఏం చేస్తాడంటూ కామెంట్ చేశారు నాని.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..