JD Lakshminarayana: కౌలు రైతుగా మారిన జేడీ.. సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం.. స్వయంగా వరినాట్లు

వ్యవసాయదారుడికి అండగా ఉండేలా మాజీ జేడీ ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా రైతులు సహజ సిద్ధమైన పద్దతులతో,సేంద్రియ విధానంలో పంటలు పండించే విధంగా తాను స్వయంగా హలం పట్టి పొలంలోకి దిగారు. వ్యవసాయం చేస్తున్నారు. 

JD Lakshminarayana: కౌలు రైతుగా మారిన జేడీ.. సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం.. స్వయంగా వరినాట్లు
Jd Lakshminarayana Farming
Follow us
Surya Kala

|

Updated on: Aug 16, 2022 | 12:57 PM

JD Lakshminarayana: స్వాతంత్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తి అయింది. జైకిసాన్.. రైతే రాజు.. రైతు అభివృద్ధి చెందితే.. దేశం అభివృద్ధి చెందుతుందని మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నాయకులు, ప్రభుత్వాలు చెప్పేమాట. మనదేశం అన్ని రంగాల్లో దినదినాభివృద్ధి సాధిస్తున్నా ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే భారంగా మారింది. భూమిని కన్న బిడ్డగా భావించి.. ప్రకృతి ప్రళయాలు వంటి అనేక పరిస్థితులను తట్టుకుని మానవాళికి అన్నం పెడుతున్న అన్నదాతలకు తినడానికి తిండి లేక, కనీస సదుపాయాలు లేక.. అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. అయితే వ్యవసాయదారుడికి అండగా ఉండేలా మాజీ జేడీ ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా రైతులు సహజ సిద్ధమైన పద్దతులతో,సేంద్రియ విధానంలో పంటలు పండించే విధంగా తాను స్వయంగా హలం పట్టి పొలంలోకి దిగారు. వ్యవసాయం చేస్తున్నారు.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం, రాచపల్లి గ్రామంలో మాజీ సిబిఐ జెడి వి వి లక్ష్మీనారాయణ 12 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకి తీసుకున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఆర్గానిక్ పద్దతిలో పంట పండించనున్నారు. ఈరోజు తాను  కౌలుకు తీసుకున్న చేలో వి వి లక్ష్మీనారాయణ స్వయంగా వరి నాట్లు నాటారు. వ్యవసాయ కూలీలతో కలిసి వరి నాట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, జేడీ అభిమానులు కూడా పాల్గొని.. వరి నాట్లు వేశారు. ఇలాంటి సంఘటన సర్వసాధారంగా సినిమాల్లోనే చూస్తాం.. నిజ జీవితంలో అరుదు అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే