AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRCP: తాడికొండ నియోజకవర్గంలో గ్రూప్ రచ్చ.. డొక్కా నియామకంపై ఎమ్మెల్యే శ్రీదేవీ వర్గం నిరసన..

తాడికొండ నియోజకవర్గంలో అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను వైసీపీ అధిష్టానం నియమించడంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గీయులు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవితో కలిసి

YSRCP: తాడికొండ నియోజకవర్గంలో గ్రూప్ రచ్చ.. డొక్కా నియామకంపై ఎమ్మెల్యే శ్రీదేవీ వర్గం నిరసన..
Mla Sridevi Vs Dokka Maniky
Sanjay Kasula
|

Updated on: Aug 23, 2022 | 2:54 PM

Share

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు తెరమీదికొచ్చాయి. తాడికొండ నియోజకవర్గంలో అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను వైసీపీ అధిష్టానం నియమించడంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గీయులు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవితో కలిసి జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటిని చుట్టుముట్టారు. దీంతో మేడికొండూరులో ఎమ్యెల్యే శ్రీదేవి అనుచరులను అరెస్ట్ చేశారు పోలీసులు. డొక్కా మాణిక్యవరప్రసాద్‌ని అదనపు సమన్వయ కర్తగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్న శ్రీదేవి వర్గీయులు అడ్డుకున్నారు పోలీసులు. ప్రెస్ మీట్ పెట్టడానికి అనుమతి లేదంటూ.. వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వైసీపీ నేత జిలానీ, మాజీ ఎంపీటీసీ నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలుచేశారు.

పార్టీకోసం ఎంతో కష్టపడి.. తాడికొండ ఎమ్యెల్యేగా శ్రీదేవిని గెలిపించుకున్నాం. ఎమ్యెల్యేకి ఇంకా రెండేళ్ల పాటు పదవి కాలం ఉంది. ఇప్పుడేం తొందర వచ్చిందని అధిష్టానం అదనపు సమన్వయ కర్తను నియమించిందంటూ వారు ప్రశ్నించారు. మా ఎమ్యెల్యే ఇప్పటి వరకు ఏ తప్పు చెయ్యలేదు.

రెండు, మూడు పార్టీలలో పని చేసిన వ్యక్తికి అదనపు సమన్వయగా నియమించడం కరెక్ట్ కాదని అన్నారు. అదనపు సమన్వయ కర్తగా డొక్కానే కాదు.. ఎవ్వరు అవసరం లేదన్నారు. అధికారంలో ఉండి కూడా.. పార్టీ ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఇతర నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించడం ఇదే తొలిసారిగా చూస్తున్నామన్నారు.

సమన్వయకర్తగా నియమించిన తర్వాత డొక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సమన్వయకర్తగా నియమించిన తర్వాత తాడికొండ అడ్డరోడ్డువద్ద సమావేశమవుతున్న ఎమ్మెల్యే వర్గీయులను కలిశారు. మళ్లీ ఎందుకు సమావేశమంటూ వారితో నేరుగా మాట్లాడడంతో అక్కడ నేతలకు ఏం మాట్లాడాలో కూడా అర్దం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంతలోనే కొందరు ఎమ్మెల్యే వర్గీయులు గొంతు మార్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం