AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొలిటికల్ బెట్టింగ్స్ కాస్తున్నారా.. మీకు ఈ కాల్స్ రావొచ్చు.. బీ అలర్ట్..

ఏపీ ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. పోలింగ్ జరిగిన తర్వాత ఫలితాలు వెలువడడానికి సుదీర్ఘకాలం వేచి ఉండాల్సి రావడంతో అందరిలోనూ ఉత్కంఠ పెరిగిపోతుంది. ఇది ఇలా ఉండగా బెట్టింగ్ రాయుళ్లు కూడా తమదైన శైలిలో రెచ్చిపోతున్నారు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో అంచనా వేస్తూ పందేలు కాస్తున్నారు. అయితే బెట్టింగ్ రాయుళ్లను ఐవిఆర్ఎస్ సర్వేల పేరుతో ఆన్ లైన్ మోసగాళ్లు వల వేస్తున్నారు. గతంలో ఎగ్జిట్ పోల్స్ మాత్రమే ఉండేవి.

పొలిటికల్ బెట్టింగ్స్ కాస్తున్నారా.. మీకు ఈ కాల్స్ రావొచ్చు.. బీ అలర్ట్..
Political Betting
T Nagaraju
| Edited By: Srikar T|

Updated on: May 27, 2024 | 1:47 PM

Share

ఏపీ ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. పోలింగ్ జరిగిన తర్వాత ఫలితాలు వెలువడడానికి సుదీర్ఘకాలం వేచి ఉండాల్సి రావడంతో అందరిలోనూ ఉత్కంఠ పెరిగిపోతుంది. ఇది ఇలా ఉండగా బెట్టింగ్ రాయుళ్లు కూడా తమదైన శైలిలో రెచ్చిపోతున్నారు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో అంచనా వేస్తూ పందేలు కాస్తున్నారు. అయితే బెట్టింగ్ రాయుళ్లను ఐవిఆర్ఎస్ సర్వేల పేరుతో ఆన్ లైన్ మోసగాళ్లు వల వేస్తున్నారు. గతంలో ఎగ్జిట్ పోల్స్ మాత్రమే ఉండేవి. పోలింగ్‎లో పాల్గొని వస్తున్న వారిని అడిగి వారి అభిప్రాయం తీసుకొని ఫలితాలను అంచనా వేసేవారు. ప్రస్తుతం ఐవిఆర్ఎస్ సర్వేలు రాష్ట్రంలో జోరుగా సాగుతున్నారు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ఎవరికి ఓటు వేశారన్న అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ తరహా సర్వేలు ఎక్కువుగానే జరుగుతున్నాయి. ఫోన్ చేసి ఓటర్లు ఎవరికి ఓటు వేశారన్న సమాచారం సేకరిస్తున్నారు. ఈ విధానంలో ఫలితాన్ని కచ్చితంగా అంచనా వేయవచ్చన్న భావన ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. దీంతో ఐవిఆర్ఎస్ సర్వేలు ప్రస్తుతం ట్రెండింగ్‎లో ఉన్నాయి.

బెట్టింగ్ రాయుళ్లను ఈ తరహా సర్వేల పేరుతో ఆకట్టుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. పందెం వేసిన వారు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ లోపే తాము వేసిన పార్టీ గెలుస్తుందా లేదా తమకు పందెం డబ్బులు వస్తుందా లేదా తెలుసుకోవాలన్న ఆత్రుత ఎక్కువైంది. అంతే కాకుండా లక్షల్లో పందేలు కాసిన వారు ముందుగానే ఫలితం తెలుసుకోవాలన్న తొందరలో కూడా ఉన్నారు. దీన్ని ఈ ఐవిఆర్ఎస్ సర్వే సంస్థలు క్యాష్ చేసుకుంటున్నారు. తమ అంచనా కచ్చితమైన ఫలితాన్ని ఇస్తుందని మీరు కాసిన పందెం సేఫా కాదా తెలసుకోవాలంటే మా సంస్థ చేపట్టిన సర్వే ఫలితాలు తెలుసుకోవాలని చెబుతున్నారు. అయితే అందుకు ముందుగానే కొంత మొత్తాన్ని కట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అ మధ్య కాలంలో బెట్టింగ్ రాయుళ్లకు ఈ తరహా ఫోన్ కాల్స్ అధికంగా వస్తున్నాయి. అయితే పేరున్న సర్వే సంస్థలే కాకుండా ఇతర సంస్థలు కూడా సర్వే చేశామని ఫలితాలు గురించి చెప్పాలంటే డబ్బులు కట్టాలని డిమాండ్ చేయడం ఒక్కడ కొస మెరుపు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా