AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జూన్‌ 2 వరకే.. ఇటు సీఎం రేవంత్ ఆదేశాలు.. అటు ఏపీ నేతల డిమాండ్.. ఏం జరగనుంది..?

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలిపినట్లు పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉండాలన్న గడువు జూన్‌ 2తో ముగియనుంది. 2 జూన్ 2024 నుంచి హైదరాబాద్‌ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది.

Hyderabad: జూన్‌ 2 వరకే.. ఇటు సీఎం రేవంత్ ఆదేశాలు.. అటు ఏపీ నేతల డిమాండ్.. ఏం జరగనుంది..?
Hyderabad
Shaik Madar Saheb
|

Updated on: May 27, 2024 | 12:36 PM

Share

ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలిపినట్లు పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉండాలన్న గడువు జూన్‌ 2తో ముగియనుంది. 2 జూన్ 2024 నుంచి హైదరాబాద్‌ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. 2014లో ఆంధ్రప్రేశ్ రాష్ట్ర విభజన జరిగినా.. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు సైతం పూర్తిగా అమలు కాలేదు.. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య భిన్నమైన వాదనలు తెరపైకి వస్తున్నాయి.

ఏపీ నేతల డిమాండ్..

తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాధాన్యమివ్వడంతో.. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఏపీకి చెందిన కొందరు నేతలు కేంద్రంపై ఒత్తిడి పెంచారు. హైదరాబాద్‌ను తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచే నిబంధనను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసే వరకు కేంద్రం జోక్యం చేసుకోవాలని, దానిని పొడిగించాలని మాజీ ఐపీఎస్ అధికారి, భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు వీవీ లక్ష్మీనారాయణ కేంద్రాన్ని కోరారు. అలాగే, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా ఒప్పించాలని ఏపీలోని ఇతర పార్టీలను లక్ష్మినారాయణ కోరారు. 2034 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచాలని ఏపీ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ ఇటీవల డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే..

సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

కాగా.. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడవు ముగుస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అన్ని భవనాలను స్వాధీనం చేసుకోవాలని, ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న ఆస్తుల పంపకాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన పలువురు నేతలనుంచి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరింత కాలం పెంచాలన్న డిమాండ్ వినిపిస్తుండటంతో కేంద్రం నిర్ణయం ఎలాఉండనుంది అనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..