Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్రలో కేకలు వేస్తున్నారా..? ఈ విషయాల గురించి తెలిస్తే గుండె గుభేల్ అనాల్సిందే.. వెంటనే ఇలా చేయండి..

నేటి బిజీ లైఫ్‌లో నిద్రలేకపోవడం, విశ్రాంతి లేకపోవడమనేది సాధారణ సమస్యగా మారింది. ఆరోగ్యంగా ఉండాలంటే.. కనీసం 8గంటల నిద్ర అవసరం.. అయితే.. ప్రస్తుత కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.. రాత్రివేళ పడుకున్నా.. గంటల తరబడి నిద్రపట్టదు.. అలా అని అర్ధరాత్రి వేళ ఎప్పుడో నిద్రపోతే.. ఉదయం లేవగానే అలసటగా అనిపిస్తుంది.

నిద్రలో కేకలు వేస్తున్నారా..? ఈ విషయాల గురించి తెలిస్తే గుండె గుభేల్ అనాల్సిందే.. వెంటనే ఇలా చేయండి..
Sleeping
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 26, 2024 | 12:16 PM

నేటి బిజీ లైఫ్‌లో నిద్రలేకపోవడం, విశ్రాంతి లేకపోవడమనేది సాధారణ సమస్యగా మారింది. ఆరోగ్యంగా ఉండాలంటే.. కనీసం 8గంటల నిద్ర అవసరం.. అయితే.. ప్రస్తుత కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.. రాత్రివేళ పడుకున్నా.. గంటల తరబడి నిద్రపట్టదు.. అలా అని అర్ధరాత్రి వేళ ఎప్పుడో నిద్రపోతే.. ఉదయం లేవగానే అలసటగా అనిపిస్తుంది. చాలా సార్లు ఇలాంటి దినచర్యను మనం తేలిగ్గా తీసుకుంటాం.. కానీ.. కొద్దిరోజుల్లోనే ఇది ప్రమాదకరంగా మారుతుంది.. క్రమంగా నిద్రకు సంబంధించిన తీవ్రమైన రుగ్మతలను ఎదుర్కొవలసి ఉంటుంది.. అయితే ఈ నిద్ర సంబంధిత సమస్యలు కూడా కొన్ని తీవ్రమైన వ్యాధికి సంకేతంగా మారుతాయని.. వాటి గురించి అవగాహనతో ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

నిద్రలేమితో పాటు, అనేక రకాల నిద్ర సంబంధిత రుగ్మతలు ఉన్నాయి.. వీటిని విస్మరించడం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నిద్రకు సంబంధించిన కొన్ని ప్రధానమైన రుగ్మతులు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

స్లీప్ అప్నియా: నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో పదేపదే అంతరాయాలు. నిద్ర లేకపోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్: కాళ్లలో విశ్రాంతి లేకపోవడం, నిద్రపోతున్నప్పుడు వాటిని కదిలించాలనే బలమైన కోరిక కలగడం..

నార్కోలెప్సీ: అధిక నిద్రపోవడం, పగటిపూట హఠాత్తుగా నిద్రపోవడం.

పారాసోమ్నియా: నిద్రలో జరిగే వింత ప్రవర్తనలు, మాట్లాడటం, నడవడం లేదా రాత్రిపూట కేకలు వేయడం వంటివి.

ఈ రుగ్మతల లక్షణాలు ప్రారంభంలో స్వల్పంగా ఉండవచ్చు.. కానీ కాలక్రమేణా తీవ్రంగా మారవచ్చు. అందువల్ల, నిద్రకు సంబంధించిన ఎలాంటి సమస్యనైనా నిర్లక్ష్యం చేయకూడదు.

సమస్యకు పరిష్కారం: వైద్య సలహా..

రాత్రి నిద్ర సరిగా లేకపోయినా లేదా ఉదయం నిద్ర లేచిన తర్వాత కూడా అలసటగా అనిపించినా వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. వైద్యులు మీ నిద్ర విధానాలు, లక్షణాలను పరిశీలించి, సమస్యను గుర్తించి చికిత్స అందిస్తారు..

పరిష్కారం ఏమిటి?

సరైన నిద్ర: సరైన నిద్ర సమయాన్ని సెట్ చేయడం, రాత్రి సమయంలో స్క్రీన్‌లు ఉన్న పరికరాల వినియోగాన్ని తగ్గించడం, నిశ్శబ్ద వాతావరణంలో నిద్రపోవడం.

కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ: నిద్ర-సంబంధిత ఆందోళనలను తగ్గించే చికిత్స.

మందులు: కొన్ని సందర్భాల్లో, వైద్యులు నిద్రను కలిగించే మందులను కూడా ఇస్తారు.

మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం.. ఎలాంటి నిద్ర సంబంధిత సమస్యను విస్మరించవద్దు… వైద్యుడిని సంప్రదించి మీ నిద్రను మెరుగుపరచుకోండి. మంచి నిద్ర ఆరోగ్యంగా.. తాజాగా ఉండటానికి సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది