- Telugu News Photo Gallery Mouth cancer Symptoms and causes: These Oral Cancer Symptoms You Should Not Ignore
Oral Cancer Symptoms: గొంతు నొప్పి, మింగడంలో ఇబ్బంది తలెత్తుతుందా? అయితే అనుమానించాల్సిందే..
భారత్‌లో నోటి క్యాన్సర్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సిగరెట్లు, బీడీలు, ఖైనీ, గుట్కా వంటి వివిధ పొగాకు ఉత్పత్తులను వినియోగించే అలవాటు ఈ ప్రాణాంతక వ్యాధికి కారణం. అయితే పొగాకు ఉత్పత్తులతో పాటు, ఆల్కహాల్ కూడా ఈ సమస్యను కలిగిస్తుంది. ఇది HPV వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. నోటి క్యాన్సర్ నోటిలోని వివిధ భాగాలకు వస్తుంది. పెదవులు, నాలుక, చెంప లోపలి భాగం..
Updated on: May 26, 2024 | 1:04 PM

భారత్‌లో నోటి క్యాన్సర్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సిగరెట్లు, బీడీలు, ఖైనీ, గుట్కా వంటి వివిధ పొగాకు ఉత్పత్తులను వినియోగించే అలవాటు ఈ ప్రాణాంతక వ్యాధికి కారణం.

అయితే పొగాకు ఉత్పత్తులతో పాటు, ఆల్కహాల్ కూడా ఈ సమస్యను కలిగిస్తుంది. ఇది HPV వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. నోటి క్యాన్సర్ నోటిలోని వివిధ భాగాలకు వస్తుంది. పెదవులు, నాలుక, చెంప లోపలి భాగం, చిగుళ్ళు, అంగిలి, గొంతులో ఎక్కడైనా నోటి క్యాన్సర్ రావచ్చు. కాబట్టి దాని లక్షణాలను గుర్తించడం చాలా అవసరం.

చాలా మందికి దీర్ఘకాలిక ధూమపానం చేసే అలవాటు ఉంటుంది. దీంతో నోటిలోపల తెల్లగా మచ్చలు అభివృద్ధి చెందుతాయి. అందుకే నోటిలో తెలుపు లేదా ఎరుపు రంగు మచ్చలతో నిండి ఉంటే, తప్పనిసరిగా డాక్టర్ వద్దకు వెళ్లాలి.

నోటి లోపల నొప్పి లేకుండా వాపు ఉన్నా ఆందోళన చెందాల్సిందే. నోటిలో గడ్డలు వంటివి ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి. నాలుక కదల్చడంలో ఇబ్బంది లేదా మాట్లాడేటప్పుడు ఏదైనా సమస్య లేదా ఆవలింత వచ్చినప్పుడు తడబడినట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

జలుబు లేదా వైరల్ జ్వరం, గొంతులో నొప్పి, మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించాన ఉపేక్షించకూడదు. ఆ నొప్పి స్వల్పకాలికంగా ఉంటే ఇబ్బంది లేదు. కానీ దీర్ఘకాలంగా ఈ లక్షణాలు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి.




