AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cracked Heel Remedy: అరటి, బొప్పాయి, తేనె, నిమ్మ.. వీటితో పాదాల పగుళ్లు చిటికెలో మాయం చేయొచ్చు! ఎలాగంటే..

చలికాలంలో చాలా మంది పాదాల పగుళ్లతో బాధపడుతుంటారు. కానీ చాలా మందికి ఏడాది పొడవునా ఈ సమస్య ఉంటుంది. పగిలిన మడమలతో నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుంది. దీంతో చాలా మంది అసౌకర్యానికి గురవుతుంటారు. కానీ నేటి బిజీ లైఫ్‌లో ప్రత్యేకంగా పాదాల సంరక్షణకు బ్యూటీ పార్లర్‌కు వెళ్లే సమయం అందరికీ ఉండదు. అయితే పాదాల పగుళ్ల సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకోవడం..

Srilakshmi C
|

Updated on: May 26, 2024 | 12:47 PM

Share
చలికాలంలో చాలా మంది పాదాల పగుళ్లతో బాధపడుతుంటారు. కానీ చాలా మందికి ఏడాది పొడవునా ఈ సమస్య ఉంటుంది. పగిలిన మడమలతో నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుంది. దీంతో చాలా మంది అసౌకర్యానికి గురవుతుంటారు.

1 / 5
కానీ నేటి బిజీ లైఫ్‌లో ప్రత్యేకంగా పాదాల సంరక్షణకు బ్యూటీ పార్లర్‌కు వెళ్లే సమయం అందరికీ ఉండదు. అయితే పాదాల పగుళ్ల సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకోవడం సాధ్యమేనంటున్నారు సౌందర్య నిపుణులు.

2 / 5
ఇంట్లో రోజూ వినియోగించే కొన్ని రకాల పండ్ల ద్వారా ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యమవుతుంది. అరటిపండు, నిమ్మ, బొప్పాయి, తేనెతో ఈ సమస్యను సులువుగా దూరం చేసుకోవచ్చు.

3 / 5
అరటిపండు తొక్కలను పాదాలు పగిలిన భాగంలో ఐదు నిమిషాల పాటు రుద్వాలి. తర్వాత కాసేపు ఆరనిచ్చి నీళ్లతో కడగాలి. ఇలా కొన్ని వారాల పాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే పాతాల పగిలిన చర్మాన్ని నయం చేయడానికి తేనెను కూడా ఉపయోగించవచ్చు. తేనెను వేడి నీటిని కలిపి.. అందులో కాళ్లను ఉంచి కాసేపు నాననివ్వాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరి.

4 / 5
పగిలిన మడమలకు పండిన బొప్పాయిని ఉపయోగించవచ్చు. బొప్పాయి తురుము పగిలిన మడమల మీద రాయాలి. ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే పగుళ్లు క్రమంగా తగ్గుతాయి. పగిలిన పాదాల మృదుత్వాన్ని పునరుద్ధరించడానికి నిమ్మ, పెట్రోలియం జెల్లీ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ పెట్రోలియం జెల్లీలో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి, పగిలిన మడమల మీద క్రమం తప్పకుండా అప్లై చేయాలి. ఇలా చేస్తే సత్వర ఫలితాలు పొందవచ్చు.

5 / 5