AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వజ్రాలు దొరుకుతున్నాయోచ్.. చిన్న రాయి దొరికినా చాలు లైఫ్ సెటిలయిపోయినట్లే.. ఎక్కడంటే..

రాయలసీమ రతనాల సీమ..అంటారు.. ఇప్పుడు నిజంగా రతనాల సీమ మాదిరిగానే మారింది.. సాధారణంగా మట్టిలో రాళ్లు రప్పలు కనిపిస్తుంటాయి.. కానీ.. ఇక్కడ మాత్రం వజ్రాలు కనిపిస్తుంటాయి.. అదికూడా వర్షా కాలంలో మాత్రమే.. సాధారణంగా వర్షం పడితే మట్టి వాసన రావడం సహజం.. కానీ రాయలసీమలో మాత్రం నాలుగు చినుకులు పడితే చాలు మ‌ట్టి నుంచి వ‌జ్రాలు బయటపడతాయి.

Andhra Pradesh: వజ్రాలు దొరుకుతున్నాయోచ్.. చిన్న రాయి దొరికినా చాలు లైఫ్ సెటిలయిపోయినట్లే.. ఎక్కడంటే..
Diamonds In Jonnagiri
Shaik Madar Saheb
|

Updated on: May 27, 2024 | 3:15 PM

Share

రాయలసీమ రతనాల సీమ..అంటారు.. ఇప్పుడు నిజంగా రతనాల సీమ మాదిరిగానే మారింది.. సాధారణంగా మట్టిలో రాళ్లు రప్పలు కనిపిస్తుంటాయి.. కానీ.. ఇక్కడ మాత్రం వజ్రాలు కనిపిస్తుంటాయి.. అదికూడా వర్షా కాలంలో మాత్రమే.. సాధారణంగా వర్షం పడితే మట్టి వాసన రావడం సహజం.. కానీ రాయలసీమలో మాత్రం నాలుగు చినుకులు పడితే చాలు మ‌ట్టి నుంచి వ‌జ్రాలు బయటపడతాయి. ఇప్పుడు వర్షాకాలం మొద‌లు కావ‌డంతో వ‌జ్రాల కోసం వేట ప్రారంభించారు. ముఖ్యంగా కర్నూలు ప్రాంత ప్రజలు పనులన్నింటిని వదులుకుని వజ్రాల వేటలో పడ్డారు.. ఏదైనా వజ్రం దొరకకపోతుందా..? తమ పంట పండకపోతుందా..? అదృష్టం కలిసిరాకపోతుందా…? అంటూ తమ పంటపొలాల్లో సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు..

ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా జొన్నగిరిలో కొందరికి బంపర్ ఆఫర్ లెక్క.. మూడు వజ్రాలు లభ్యమయ్యాయి. ఓ వజ్రం 6 లక్షల యాభై వేలు, మరో వజ్రం 2 లక్షల యాభై వేలకు విక్రయించగా.. ఇంకో వజ్రం లక్షా ఇరవై వేలకు ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు.. మూడు రోజుల్లో నాలుగు వజ్రాలు దొరకడంతో.. జొన్నగిరికి పెద్ద ఎత్తున వజ్రాల అన్వేషకులు చేరుకుని వేటను కొనసాగిస్తున్నారు.

వీడియో చూడండి..

ముఖ్యంగా.. క‌ర్నూలు జిల్లా తుగ్గిలి, జొన్నగిరి, అనంత‌పురం జిల్లా వ‌జ్రక‌రూరులో వ‌జ్రాల కోసం వేట కొనసాగిస్తుంటారు. ఈ ప్రాంతాలతో పాటు ఎమ్మిగనూరు, కోసిగిలోని పంటపొలాల్తొలో కూడా వజ్రాలు లభిస్తూ ఉంటాయి. దీంతో వర్షాలు కురుస్తుండటంతో వ‌జ్రపు రాళ్లు బ‌య‌ట‌ప‌డకపోతాయా..? తమ పంట పండకపోతుందా అంటూ వజ్రాల అన్వేషకులు ఈ ప్రాంతాల్లో సెర్చింగ్ మొదలుపెట్టారు.

ఇవి కూడా చదవండి

చిన్న రాయి దొరికినా చాలు త‌మ జీవితాలు మారిపోతాయ‌నే ఆశ‌తో జ‌నం పెద్ద ఎత్తున సంబంధిత గ్రామాల్లో జ‌ల్లెడ ప‌డుతున్నారు. స్థానికంగానేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వజ్రాల వేట కోసం వస్తుండటంతో ఈ ప్రాంతాల్లో సందడి నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?