Watch Video: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు..

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం ఎం. కొంగరవారిపల్లి వద్ద కారు కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే మూడు మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. ఒకరి డెడ్ బాడీ రోడ్డుపై పడింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు.

Watch Video: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు..

| Edited By: Srikar T

Updated on: May 27, 2024 | 9:48 AM

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం ఎం. కొంగరవారిపల్లి వద్ద కారు కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే మూడు మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. ఒకరి డెడ్ బాడీ రోడ్డుపై పడింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదానికి అతివేగం నిద్రమత్తు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కల్వర్టును నేరుగా ఢీ కొనగా మృతులు నెల్లూరు జిల్లా ఇందుకూరు పేటకు చెందిన వారుగా గుర్తించారు. నెల్లూరుజిల్లా ఇందుకూరు పేట నుంచి సీఎంసీ వేలూరు ఆసుపత్రికి వెళుతుండగా ప్రమాదానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో మృతి చెందిన నలుగురిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ప్రమాదానికి అతివేగం నిద్రమత్తే కారణమని భావిస్తున్నరు పోలీసులు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 6 మంది ప్రయాణిస్తున్నారు. 4 స్పాట్ లో మృతి చెందగా, తీవ్రంగా గాయపడి ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ మినహా మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. ప్రమాదంలో డ్రైవర్ షేక్ సంశీర్, శేషయ్య, పద్మమ్మ, జయంతి మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ నీరజ, శ్రీనివాసులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us