Andhra: నాన్నా.. అమ్మ జోలికి పోవద్దు అని చెప్పినా వినకపోవడంతో.. కోపం పట్టలేక..
అల్లూరి జిల్లా కొయ్యూరులో కూర కోసం ప్రారంభమైన గొడవ ప్రాణాంతకంగా మారింది. తల్లి మీద తండ్రి వేధింపులు తట్టుకోలేక కొడుకు చెక్క పీటతో మోదడంతో తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి .. .. ..

కూర కోసం గొడవ ఒకరి ప్రాణాలు తీసింది.. తప్ప తాగి ఇంట్లో భార్యను వేధించాడు భర్త. అంతేకాదు కూర విషయంలో ఆమెతో గొడవపడ్డాడు.. ఆమెపై దాడికి యత్నించాడు. తల్లికి తండ్రి వేధింపులు భరించలేక పోయాడు కొడుకు. విచక్షణ కోల్పోయి కర్ర పీటతో తలపై మోదాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు తండ్రి.
వివరాల్లోకి వెళితే.. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం మఠం భీమవరం పంచాయితీ బొడ్డు మామిడి లంక గ్రామంలో భార్య లక్ష్మమ్మ, కొడుకు లోవరాజుతో కలిసి నివాసం ఉంటున్నాడు కొండయ్య. తరచూ బుడ్డయ్య తన భార్య లక్ష్మితో గొడవ పడుతూ ఉండేవాడు. చీటికిమాటికి తిడుతూ పడుతూ హింసిస్తూ ఉండేవాడు. కొడుకు ఎంత వారిస్తున్నప్పటికీ తండ్రి ప్రవర్తన మార్చుకోలేదు. ఈ విషయంలో కొడుకు తండ్రి మధ్య అనేకమార్లు గొడవలు జరిగేవి. ఈనెల 27 న.. ఇంట్లో వండిన కూర విషయంలో భార్య లక్ష్మమ్మతో బొడ్డయ్య గొడవకు దిగాడు. ఆమెపై దాడికి యత్నించాడు. పరుష పదజాలంతో దూషించాడు భర్త. అక్కడే ఉన్న కొడుకు లోవరాజు.. తన తల్లిని తండ్రి పెడుతున్న టార్చర్ భరించలేకపోయాడు. వారిస్తున్నప్పటికీ వెనక్కి తగ్గలేదు తండ్రి బొడ్డయ్య. దీంతో విచక్షణ కోల్పోయిన కొడుకు లోవరాజు.. పక్కనే ఉన్న చెక్క పీటతో తండ్రి తలపై మోదాడు. దీంతో అక్కడే కుప్పకూలిపోయాడు తండ్రి బొడ్డయ్య. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




