YS Jagan: మేమంతా సిద్ధం.. ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్న సీఎం జగన్.. సంజీవపురం టు చీకటిమనిపల్లె..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ వైసీసీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బస్సు యాత్రతో దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు.

YS Jagan: మేమంతా సిద్ధం.. ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్న సీఎం జగన్.. సంజీవపురం టు చీకటిమనిపల్లె..
Ys Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 01, 2024 | 7:03 AM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ వైసీసీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బస్సు యాత్రతో దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో బస్సుయాత్ర పూర్తి కాగా.. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఆదివారం ఈస్టర్‌ సందర్భంగా స్వల్ప బ్రేక్‌ ఇచ్చారు. ఇవాళ సంజీవపురం క్యాంప్‌ సైట్‌ నుంచి వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రను సీఎం జగన్ కొనసాగించనున్నారు.

మేమంతా సిద్ధం ఐదోరోజు షెడ్యూల్ ఇదే..

ముఖ్యమంత్రి జగన్‌ బస్సు యాత్ర ఐదో రోజు షెడ్యూల్‌ ప్రకారం.. బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్‌ఎస్పి కొట్టల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు. ఆ తర్వాత పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్రదొడ్డి మీదుగా కుటగుల చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం తర్వాత బయలుదేరి కదిరి పట్టణం చేరుకుని పీవీఆర్ ఫంక్షన్‌ హాల్‌లో మైనారిటీలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఆ తర్వాత మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్ ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.

మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అభిమానం పోటెత్తుతోంది. పల్లె పల్లెలో సీఎం జగన్‌కు మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకుల నుంచి సీఎం జగన్ బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..