Andhra Pradesh: సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం.. సీఎం జగన్ సంచలన ప్రకటన..
‘‘తోడేళ్లంతా ఏకమై చీకటి యుద్ధం చేస్తున్నాయి.. ఈ చీకటి యుద్ధంలో ప్రజలే నా ధైర్యం.. నా ఆత్మవిశ్వాసం మీరే’’.. అంటూ సీఎం జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్.. రాజధానిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం ఉండనున్నట్టు ఆయన వెల్లడించారు.
‘‘తోడేళ్లంతా ఏకమై చీకటి యుద్ధం చేస్తున్నాయి.. ఈ చీకటి యుద్ధంలో ప్రజలే నా ధైర్యం.. నా ఆత్మవిశ్వాసం మీరే’’.. అంటూ సీఎం జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్.. రాజధానిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం ఉండనున్నట్టు ఆయన వెల్లడించారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నంలోనే బస చేయబోతున్నట్టు స్పష్టంగా ప్రకటించారు ముఖ్యమంత్రి. విపక్షపార్టీలపైనా విరుచుకుపడ్డారు జగన్. తోడేళ్లంతా ఏకమై చీకటి యుద్ధం చేస్తున్నాయన్నారు జగన్. జిల్లా పర్యటనలో నాలుగు కీలక ప్రాజెక్టులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. 46 నెలల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. మరో చెన్నై, ముంబైలా మారనున్న శ్రీకాకుళం జిల్లా మారనుందని సీఎం జగన్ పేర్కొన్నారు. మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టు, అదానీ సెంటర్లకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. టెక్కలిలో దువ్వాడ శ్రీనును ఆశీర్వదించాలన్నారు. రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్య నగరం విశాఖ అని పేర్కొన్న జగన్.. ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానంటూ స్పష్టంచేశారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే.. అన్ని జిల్లాల అభివృద్ధి కొనసాగుతోందని తెలిపారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తపన అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు.. మిగతా వాళ్లంతా ఏకమవుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పెత్తందార్లు.. పేదల పక్షాన నిలబడిన నాకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతున్నారంటూ సీఎం జగన్ మండిపడ్డారు. వాళ్లలా అబద్ధాలు చెప్పే అలవాటు తనకు లేదని.. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం మీరేనంటూ పేర్కొన్నారు. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకుంటున్నారు.. తోడేళ్లన్నీ ఏకమైనా.. నాకేమీ భయం లేదంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
ముందుగా శ్రీకాకుళం చేరుకున్న సీఎం జగన్.. గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్లతో మూలపేట పోర్టు పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..