AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ‘నా ప్రపంచం ఇదే’.. సోషల్ మీడియా మీమ్స్‎పై సీఎం జగన్ స్పందన..

సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్‎, ట్రోల్స్‎పై తొలిసారి స్పందించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. తనకు తన కుటుంబం పిల్లలే ప్రపంచం అన్నారు. టీవీ9కు ఇచ్చిన ఇంటర్వూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తనది చిన్న జీవితమని, తనకంటూ ప్రత్యేకించి ప్రైవేట్ లైఫ్ ఏమీ ఉండదని తెలిపారు. పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అంతా ఒక్కటే అన్నారు. తనకు తన భార్య వైఎస్ భారతి, తన పిల్లలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డి అంటే అమితమైన ప్రేమ అని ఈ సందర్భంగా అంతరంగంలోని భావనను వ్యక్తం చేశారు.

CM Jagan: 'నా ప్రపంచం ఇదే'.. సోషల్ మీడియా మీమ్స్‎పై సీఎం జగన్ స్పందన..
Ys Jagan On Land Act
Srikar T
|

Updated on: May 09, 2024 | 8:55 AM

Share

సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్‎, ట్రోల్స్‎పై తొలిసారి స్పందించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. తనకు తన కుటుంబం పిల్లలే ప్రపంచం అన్నారు. టీవీ9కు ఇచ్చిన ఇంటర్వూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తనది చిన్న జీవితమని, తనకంటూ ప్రత్యేకించి ప్రైవేట్ లైఫ్ ఏమీ ఉండదని తెలిపారు. పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అంతా ఒక్కటే అన్నారు. తనకు తన భార్య వైఎస్ భారతి, తన పిల్లలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డి అంటే అమితమైన ప్రేమ అని ఈ సందర్భంగా అంతరంగంలోని భావనను వ్యక్తం చేశారు. అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడు ఓటీటీ మాధ్యమాలలో నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు చూస్తూ ఉంటానన్నారు. ఇదే తన ప్రపంచం అని స్పష్టం చేశారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో జరిగే ట్రోల్స్, మీమ్స్ ను అస్సలు చూడనని, వాటిని పట్టించుకోనని, అంత సమయం ఉండదని సున్నితంగా నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

అలాగే తన పాలనలో రాష్ట్రంలో గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధి చేశామన్నారు జగన్‌ అన్నారు. లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. పారిశ్రామిరవేత్తలు క్యూ కడుతున్నారన్నారు. మూడు వేల లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. నేను చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. చూడాలని లేనప్పుడు అభివృద్ధి కనిపించదన్నారు. 2019 ఎన్నికలతో పోల్చితే తన కాన్ఫిడెన్స్‌ ఈసారి చాలా ఎక్కువుందన్నారు సీఎం జగన్‌. రాష్ట్రంలో 90 శాతం కుటుంబాల అభివృద్ధిలో జగన్‌ పాత్ర ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో తాను మాట్లాడే ప్రతి మాట ఎంతో గౌరవప్రదంగానే ఉంటుందని జగన్‌ స్పష్టం చేశారు. విపక్షాల మాటల్లో నిరాశ కనిపిస్తోందన్నారు.పిల్లల చదువులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, పిల్లల బతుకులు మారాలంటే నాణ్యమైన విద్య అవసరమన్నారు సీఎం జగన్. నాణ్యమైన విద్యతో పిల్లల టాలెంట్‌ మెరుగవుతుందన్నారు. అందుకే అమ్మ ఒడి ఇస్తున్నామన్నారు. పిల్లలకు పెట్టే ప్రతి రూపాయి వారి అభివృద్ధి కోసమేనన్నారు.

సీఎం జగన్ వీడియో..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..