CM Jagan: పవన్ కళ్యాణ్‎ను దత్తపుత్రుడు అనడానికి కారణం ఇదే.. సీఎం జగన్ స్పష్టత..

పవన్‌ కల్యాణ్‌ గురించి తాను చాలా తక్కువ మాట్లాడతానని సీఎం జగన్‌ అన్నారు. తన మాటలంతా ఎప్పుడూ చంద్రబాబును ఉద్దేశించే ఉంటాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అనడానికి కారణం చంద్రబాబు పాపాల్లో పవన్‌ భాగస్వామి అని స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌కు ఓటేసే ముందు రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. 2014 మేనిఫెస్టో ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో ఉందని, అప్పుడు వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. అందులో కూడా పవన్ కళ్యాణ్‌ భాగస్వామి అని చెప్పారు.

Follow us
Srikar T

|

Updated on: May 09, 2024 | 8:35 AM

పవన్‌ కల్యాణ్‌ గురించి తాను చాలా తక్కువ మాట్లాడతానని సీఎం జగన్‌ అన్నారు. తన మాటలంతా ఎప్పుడూ చంద్రబాబును ఉద్దేశించే ఉంటాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అనడానికి కారణం చంద్రబాబు పాపాల్లో పవన్‌ భాగస్వామి అని స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌కు ఓటేసే ముందు రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. 2014 మేనిఫెస్టో ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో ఉందని, అప్పుడు వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. అందులో కూడా పవన్ కళ్యాణ్‌ భాగస్వామి అని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా క్యారెక్టర్ మంచిగా ఉండాలన్నారు. రాజకీయాల్లో ఉంటే ఇంకా ఎక్కువగా కచ్చితత్వంతో ఉండాలన్నారు. రోల్ మోడల్ గా, ఆదర్శవంతంగా జీవితం ఉండాలన్నారు. అందుకే పవన్ పెళ్లిళ్ల అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రదాన ఉద్దేశం ఇలా ఎవరూ ట్రెండ్‎ను ఫాలోకాకూడదని తెలిపారు. ఇలాంటి వ్యక్తిని రోల్ మోడల్ గా తీసుకుంటే దేశం ఏమైపోతుందని, అక్కచెల్లెమ్మల జీవితాలు ఏమైపోతాయో ఒక్క ఆలోచన చేయండని చెప్పే ఉద్దేశమే తప్ప వేరొకటి లేదన్నారు. తప్పును ఎత్తి చూపి ఇలా చేయకూడదని చెప్పేందుకు పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చినట్లు తెలిపారు.

రిలేషన్స్‌లో రాజకీయాలు చొరబడితే కుటుంబాల్లో కల్మషం వస్తుందన్నారు సీఎం జగన్‌. రాజకీయాలకు కుటుంబసభ్యులు దూరంగా ఉంటే బెటరని.. దానివల్ల బంధుప్రీతి, అవినీతి ఆరోపణలు వస్తాయన్నారు. కుట్ర కోణంలో ఉండే చంద్రబాబు తమ కుటుంబ వివాదాన్ని మరింత రెచ్చగొట్టారన్నారు. గొడవను శ్రుతి మించితే ఏమీ చేయలేమన్నారు జగన్‌. బీజేపీ విషయంలో తనకు సాఫ్ట్‌ కార్నర్‌ ఏమి లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వ్యతిరేకించే విషయాల్లో కచ్చితంగా వ్యతిరేకిస్తామన్నారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో తన వైఖరిని జగన్‌ విస్పష్టంగా TV9 వేదికగా వెల్లడించారు. మతం వేరు రిజర్వేషన్లు వేరన్నారు జగన్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..