Jagan on Sharmila: చెల్లెలు షర్మిల వ్యవహారంపై టీవీ9 ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్
రిలేషన్స్‌లో రాజకీయాలు చొరబడితే కుటుంబాల్లో కల్మషం వస్తుందని సీఎం జగన్ అన్నారు. చెల్లెలు షర్మిల వ్యవహారంపై ఆయన స్పందించారు. కుట్ర కోణంలో ఉండే చంద్రబాబు ఆ వివాదాన్ని మరింత రెచ్చగొట్టారని అన్నారు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు సవాళ్లు వస్తాయని స్పష్టం చేశారు.
రిలేషన్స్‌లో రాజకీయాలు చొరబడితే కుటుంబాల్లో కల్మషం వస్తుందని సీఎం జగన్ అన్నారు. చెల్లెలు షర్మిల వ్యవహారంపై ఆయన స్పందించారు. కుట్ర కోణంలో ఉండే చంద్రబాబు ఆ వివాదాన్ని మరింత రెచ్చగొట్టారని అన్నారు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు సవాళ్లు వస్తాయని స్పష్టం చేశారు. ఒక స్థాయి వరకు గొడవను సర్దుబాటు చేయవచ్చని, అది శృతి మించితే ఏం చేయలేమని జగన్ అన్నారు.
రాష్ట్రంలో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్‌కు రాలేదన్న జగన్, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని సవాళ్లు వస్తాయన్నారు. మనం తీసుకునే సిద్దాంతాలు మన క్యారెక్టర్‌ను నిర్వచిస్తాయి. కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఇస్తే బంధుప్రీతి, అవినీతి ఆరోపణలు తప్పవన్నారు. ఎన్నికలయ్యాక షర్మిల స్టాండ్ ఏంటో తెలుస్తుందన్నారు జగన్. చరిత్రలో ఎవరూ చేయని విధంగా పాలన చేస్తున్నా, నా ఫొటో ప్రతి ఇంట్లో ఉండాలనేలా పాలన. నేను చనిపోయినా.. ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండాలనుకుంటానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఒకే కుటుంబం నుంచి ఒకే తరం వాళ్లు రావడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది. వైసీపీపై కోట్ల మంది ఆధారపడి ఉన్నారన్నారు.
రాష్ట్రంలో అంతా మంచే చేసినప్పుడు వైనాట్ 175 అని జగన్ ప్రశ్నించారు. అందరితో సత్సంబంధాలు ఉండాలని నేను ఆశిస్తాను. నాకు ప్రైవేట్ లైఫ్ అంటూ ప్రత్యేకంగా లేదు. పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అంతా ఒక్కటే. దేవుడిపై నమ్మకం, ప్రజలపై విశ్వాసం ఉందని జగన్ స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..