AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: పీడీ యాక్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. తప్పు చేస్తే తాటతీస్తామని హెచ్చరిక

తప్పు చేస్తే తాటతీస్తామని హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు. శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమన్నారు. ఇందుకోసం చట్టాలను మరింత పటిష్టంగా మారుస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగానే..

Chandrababu: పీడీ యాక్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. తప్పు చేస్తే తాటతీస్తామని హెచ్చరిక
Chandrababu
Ravi Kiran
|

Updated on: Nov 21, 2024 | 9:00 PM

Share

తప్పు చేస్తే తాటతీస్తామని హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు. శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమన్నారు. ఇందుకోసం చట్టాలను మరింత పటిష్టంగా మారుస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగానే ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు సీఎం చంద్రబాబు. సభలో ప్రివెంటివ్‌ ఆఫ్ డేంజరస్ యాక్ట్స్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పీడీ యాక్ట్, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ పాటు పోలీసు వ్యవస్థ బలోపేతం, మహిళా భద్రత గురించి మాట్లాడారు. పీడీ యాక్ట్‌కు పదును పెట్టామన్నారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్నారు. భద్రత లేకపోతే రాష్ట్రానికి టూరిస్టులు రాని పరిస్దితి తలెత్తుతుందన్నారు.

ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా

గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మోసాలు, అక్రమాలకు తెరదీశారని ఆరోపించారు. సివిల్ జడ్జిల అధికారాలను రెవెన్యూ అధికారులకు ఇచ్చారని.. ఎవరినైనా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్లుగా పెట్టుకునేలా చట్టాన్ని తెచ్చారన్నారు. నోటీసు ఇవ్వకుండా భూ యజమాని పేరు మార్చేలా చట్టం తీసుకొచ్చారని.. కింది స్థాయి కోర్టుల్లో ఫిర్యాదులకు తావు లేకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లే పరిస్ధితి కల్పించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేశామన్నారు చంద్రబాబు. గ్రామాలు, పట్టణాలు సహా ఎక్కడైనా సరే భూమి కబ్జా చేస్తే ఈ చట్టం వర్తిస్తుందన్నారు. కొత్త చట్టం ప్రకారం భూ కబ్జా చేసినా, కబ్జాకు ప్రయత్నించినా, బెదిరించినా శిక్షకు గురవుతారని హెచ్చరించారు. కొంతమంది సీనియర్ అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ పోలీసు వ్యవస్థకు మచ్చ తెచ్చారని మండిపడ్డారు. ఇలాంటి వారిని సస్పెండ్ చేశామన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఎవ్వరినీ ప్రభుత్వం ఉపేక్షించదని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ప్రజాహితం కోసం పనిచేయాలని చంద్రబాబు సూచించారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..? తింటే ఇక పోతారు అంతే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి