సైబర్ నేరగాళ్లకే చుక్కలు చూపించిన సామాన్యుడు.. రెప్పపాటులో రూ. లక్షలు సేఫ్‌!

అప్పటికే లింకు ద్వారా ఫోను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌ క్రెడిట్ కార్డుపై లోన్‌కు అప్లై చేశారు. ఇది మూడు దశల్లో చేయాల్సి ఉంటుంది.

సైబర్ నేరగాళ్లకే చుక్కలు చూపించిన సామాన్యుడు.. రెప్పపాటులో రూ. లక్షలు సేఫ్‌!
Cybercriminals
Follow us
P Kranthi Prasanna

| Edited By: TV9 Telugu

Updated on: Nov 22, 2024 | 2:53 PM

సాధారణంగా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే ఎవరైనా అకౌంట్లు ఖాళీ చేసుకోవాల్సిందే..! కానీ ఓ సామాన్య ఉద్యోగి మాత్రం సైబర్ నేరగాళ్లకే చుక్కలు చూపించాడు. ప్రాసెస్ మొత్తం అయిపోయింది జస్ట్ కొద్ది నిమిషాల్లోనే ఐదు లక్షల రూపాయలు కొట్టేద్దాం అనుకున్న కేటుగాళ్ళకి తన తెలివితేటలతో జలక్ ఇచ్చాడు. వారు ప్రాసెస్ పూర్తి చేసే లోపే అడ్డుకట్ట వేసి తన ఖాతాలో డబ్బులు ఖాళీ అవకుండా సేవ్ చేసుకున్నాడు. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా..!

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన స్టాక్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో పనిచేసే ఓ చిన్న ఉద్యోగికి ఓ కొరియర్ రావాల్సి ఉంది. తన బంధువులు కొద్దిరోజుల క్రితం రాజమండ్రి నుంచి డిటిడిసిలో కొరియర్ చేశారు. అయితే సెలవు దినం కావడం ఇలా రకరకాల కారణాలతో పార్సెల్ కాస్త ఆలస్యమై చేరుకోలేదు. దాంతో వెంటనే ఆ వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసిన నెంబర్ ద్వారా నాగేశ్వరావు తన కొరియర్ ట్రాక్ చేశాడు. పార్సిల్ విజయవాడ లోనే డెలివరీకి వచ్చినట్టు చూపిస్తుంది. కానీ ఇంటికి మాత్రం రాలేదు.

దాంతో వెబ్‌సైట్‌లో ఉన్న ఒక కాంటాక్ట్ నెంబర్ ని వెతుక్కుంటూ వాళ్లకు ఫోన్ చేశాడు నాగేశ్వరరావు. హిందీలో మాట్లాడుతూ ఒక వ్యక్తి రెస్పాండ్ అయ్యాడు. తనకి హిందీ రాకపోవడంతో మరో వ్యక్తి కాల్ చేస్తాడంటూ ఫోన్ పెట్టేసిన నిమిషానికి ఇంకో కాల్ వచ్చింది నాగేశ్వరరావుకు. అతను హిందీ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ వాట్సాప్ ద్వారా ఓ లింకు పెట్టాడు. అప్పటికే అనుమానంలో ఉన్న నాగేశ్వరరావు అటు ఇటుగా అతని మాటలు వింటూనే అతను చెప్పిన పని చేస్తూ ఆ లింకు క్లిక్ చేశాడు. దానికి ఓటీపీ వస్తుందని వెంటనే చెప్పాలని అవతలి వ్యక్తి అడగడం నాగేశ్వరావు ఓటీపీ చెప్పడం అలా గూగుల్ పే ఫోన్ పే లో ఐదు రూపాయలు పంపిస్తే.. ఆ అమౌంట్ మళ్లీ తిరిగి జమవుతాయని ఇదంతా కేవలం కన్ఫర్మేషన్ కోసమే అంటూ నమ్మబలికాడు కేటుగాడు

ఇక్కడ వరకు కథంతా బాగానే ఉంది. ఇదంతా నమ్మి గుడ్డిగా చేసుకుంటూ వెళ్లిపోయిన నాగేశ్వరరావు, అప్పటికి అనుమానంతోనే ఉన్నాడు. ఈలోపు అతను అనుమానాన్ని నిజం చేస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి ఓటిపిలు మెసేజ్‌లు వరుసగా రావడం ప్రారంభమయ్యాయి. అందులో మీరు ఐదు లక్షలు ఉపయోగించుకున్నట్టు మెసేజ్ రావడంతో నాగేశ్వరరావు గుండెగుభేలుమంది. దాంతో కంగారు పడకుండా వెంటనే అతని కార్డు లిమిట్ చెక్ చేసుకున్నాడు.

అందులో లక్ష మాత్రమే లిమిట్ ఉన్నట్టు చూపిస్తోంది. అయితే ఆరు లక్షలకు గాను ఐదు లక్షల ఉపయోగించుకున్నట్టు మెసేజ్ రావడంతో తను సైబర్ నేరగాల ట్రాప్ లో పడ్డానని కన్ఫామ్ చేసుకున్న నాగేశ్వరరావు, వెంటనే ఈ విషయాన్ని బ్యాంక్‌కు వెళ్లి చెప్పాడు. తన కార్డు బ్లాక్ చేయాలని అడిగాడు. అయితే సిబ్బంది మాత్రం ఆన్‌లైన్‌లో పరిశీలించి అసలు అలాంటిదేమీ జరగలేదని తేల్చి చెప్పారు. దాంతో మళ్లీ వెంటనే క్రెడిట్ కార్డ్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేశాడు. ఇదే సమాధానం వచ్చింది..

ఇక అప్పటికే లింకు ద్వారా ఫోను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌ క్రెడిట్ కార్డుపై లోన్‌కు అప్లై చేశారు. ఇది మూడు దశల్లో చేయాల్సి ఉంటుంది. ప్రతి దశలను ఓటిపి ఎంటర్ చేయాలి. ఇదంతా కూడా నాగేశ్వరరావుతో ఫోన్ మాట్లాడుతున్న సమయంలోనే సైబర్ నేరగాళ్లు పూర్తి చేశారు. అయితే ఇంస్టాగ్రామ్ లోన్ కు సంబంధించి డబ్బులు ఆ బ్యాంకులో ఉన్న అకౌంట్లోనే జమవుతాయి. అలా ఐదు లక్షలు నాగేశ్వరరావు అకౌంట్లో జమయ్యాయి. ఇది వెంటనే అప్డేట్ కాకపోవడంతో బ్యాంకు సిబ్బందికి ఈ విషయం తెలియలేదు.

అప్పటికే ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయాలని ఆయన దరఖాస్తు చేసుకోవడం వెంటనే స్మార్ట్ ఫోన్ లో ఉన్న తన సిమ్ ను తీసేసి కీప్యాడ్ ఫోన్లో సిమ్ మార్చుకోవడంతో సైబర్ నేరగాళ్లు తన ఫోన్ హ్యాక్ చేయలేకపోయారు. ఇక ఈలోపు బ్యాంక్ ఇబ్బంది సైతం ఫోన్ చేసి క్రెడిట్ కార్డుపై ఇంస్టా లోన్ ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పారు. ఇదంతా తన ప్రమేయం లేకుండానే జరిగిందని తన అకౌంట్లో ఉన్న ఐదు లక్షల రూపాయలు మినహాయించుకుని క్రెడిట్ కార్డుకు జమ చేసుకోవాలని నాగేశ్వరరావు చెప్పి డబ్బులు లాగడానికి ప్రయత్నించిన కేటుగాళ్లకే షాక్‌ ఇచ్చాడు. రెప్పపాటు అప్రమత్తతతో ప్రమాదం తప్పింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.