AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: దొంగలను పట్టించే ఆలయం.. ఈ విషయం తెలుసుకున్న దొంగలు ఏం చేశారంటే

పురాతన ఆలయాల్లో ఎన్నో వింతలు ఉంటాయి. కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాల్లో ఎంతో అధునాతన టెక్నాలజీతో కూడిన నిర్మాణాలు ఉంటాయి. అలాంటి ఓ వింత నిర్మాణం ఒక ఆలయంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న ఓ బండరాయి దొంగలను పట్టిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు..

Andhra Pradesh: దొంగలను పట్టించే ఆలయం.. ఈ విషయం తెలుసుకున్న దొంగలు ఏం చేశారంటే
Temple
Sudhir Chappidi
| Edited By: Narender Vaitla|

Updated on: Nov 22, 2024 | 11:52 AM

Share

ఆ ప్రాంతంలో దొంగతనం జరిగిందంటే ఇట్టే కనిపెట్టేయొచ్చు. దొంగతనం చేసిన వారి మొహాలు కళ్ళకు కట్టినట్టు కనబడతాయంట. అలా అని దొరకని వస్తువులు తప్పిపోయిన జీవాలు ఏమైనా సరే అక్కడికి వచ్చి దేవుడిని దర్సించుకుని వారి సమస్య చెబితే చాలు అవి ఎక్కడ ఉన్నాయో తెలిసిపోతాయంట .. అయితే ఇలా తెలిసిపోతుంది అని తెలుసుకున్న దొంగలు ఆ కనబడే ప్రాంతాన్ని ఏమి చేశారో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.

కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం వీరపునాయని పల్లి మండలం లోని సంగమేశ్వర దేవాలయాలు ఎంతో పవిత్రమైనవి. ఈ దేవాలయానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడ మహాశివుడిని కొలుస్తారు శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. అలాంటి దేవాలయంలో ఒక పవిత్రమైన సన్నివేశం జరుగుతుంది . ఆ ప్రాంతంలో దొంగతనాలు జరిగాయి అని ఎవరైనా అక్కడికి వచ్చి అక్కడ ఉన్న రాయి మీద చూస్తే ఆ రాయి మీద స్పష్టంగా ఎవరు దొంగతనం చేశారు అనేది చిత్రంతో సహా కనబడుతుంది అంట.

అంతేకాదు ఇంట్లో ఉన్న వస్తువులు ఏమి పోయినా అలాగే ఇంట్లో ఉన్న గేదలు గాని పశువులు గాని ఏమన్నా కనిపించకుండా పోతే అక్కడకు వచ్చి ఆ దేవాలయంలో చూస్తే అవి తప్పిపోయి ఎక్కడ ఉన్నాయి లేదా వాటిని ఎవరినైనా దొంగిలించారా అనేది చాలా క్లియర్ గా కనబడుతుందని విశ్వాసం. సంగమేశ్వర దేవాలయంలో గర్భగుడికి ముందు నేలపై ఒక పెద్ద నాపరాయి ఉంటుంది ఆ నాపరాయి అద్దం మాదిరి ఉంటుందని ఎవరైనా అక్కడకు వచ్చి తమకు జరిగిన నష్టం గురించి దేవుడికి మొక్కుకొని ఆ రాతి దగ్గరకు వచ్చి నిలబడితే ఆ దొంగతనం గాని ఏదైనా తప్పుగాని ఎవరు చేశారనేది క్లియర్ కట్ గా కనబడుతుంది అంట.

అంతేకాకుండా ఇంట్లో పోయిన ఏ వస్తువైనా కూడా ఎక్కడ ఉంది అనేది క్లియర్గా ఆ నాపరాతిలో కనపడుతుంది అనేది ఇక్కడ ఉన్న దేవాలయానికి సంబంధించిన స్థల పురాణం చెబుతుంది. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలే కాదు కడప జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ఏమన్నా దొంగతనం జరిగితే ఆ దేవలానికి వెళ్లి అక్కడ చూస్తే చాలా క్లియర్ గా కనబడుతుంది అనేది ఒక నమ్మకం అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న దొంగలు ఆ నాపరాతి పై గడ్డిని వేసి ఆ రాతిని కాలిచేశారని అప్పటినుంచి అక్కడ ఆ పవిత్రత ఆ రాయి కోల్పోయిందని స్థానిక ప్రజలు అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..