Andhra Pradesh: మంటల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.. విలువైన డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతి

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం లోని చిట్వేలు మండలంలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా పాతది అవ్వడం వల్లనే విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించాయి అని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. అంతేకాకుండా కార్యాలయంలో ఫైర్ సేఫ్టీ కి సంబంధించిన ఎటువంటి నియమాలు తీసుకోకపోవడం వలన డాక్యుమెంట్లన్నీ పూర్తిగా ఖాళీ దద్దమయ్యాయని తెలుస్తోంది.

Andhra Pradesh: మంటల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.. విలువైన డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతి
Fire Accident
Follow us
Sudhir Chappidi

| Edited By: Surya Kala

Updated on: Feb 07, 2024 | 6:48 PM

సబ్ రిజిస్టర్ కార్యాలయం మంటల్లో చిక్కుకుని డాక్యుమెంట్లు అందులో ఉన్న కంప్యూటర్లు మొత్తం ఖాళీ బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో సిబ్బంది కూడా ఏమి చేయలేకపోయారు. ప్రాణాలను కాపాడుకోవడం కోసం డాక్యుమెంట్లను సిస్టమ్స్ ను అక్కడే వదిలేసి బయటకు వచ్చారు. దీంతో విలువైన డాక్యుమెంట్లన్నీ మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం లోని చిట్వేలు మండలంలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా పాతది అవ్వడం వల్లనే విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించాయి అని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. అంతేకాకుండా కార్యాలయంలో ఫైర్ సేఫ్టీ కి సంబంధించిన ఎటువంటి నియమాలు తీసుకోకపోవడం వలన డాక్యుమెంట్లన్నీ పూర్తిగా ఖాళీ దద్దమయ్యాయని తెలుస్తోంది. ఇటీవల డిజిటలైజేషన్ చేసిన డాక్యుమెంట్లు కూడా పూర్తిగా నాశనమయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఆఫీసులో ఉన్న కంప్యూటర్లు కూడా పూర్తిగా కాలిపోవడంతో ఎటువంటి డాక్యుమెంట్లు మిగలలేదు. డాక్యుమెంట్ రైటర్లు గత నెల రోజులుగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉంచిన డాక్యుమెంట్లు అన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి. అయితే రికార్డు రూమ్ లో ఉన్న డాక్యుమెంట్లు మాత్రం సేఫ్ గా ఉన్నట్లు ఆఫీసు సిబ్బంది చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..