Ayodhya: సూక్ష్మ కళాకారుడి చేతిలో అత్యద్భుతంగా అయోధ్య రామాలయం.. ఔరా అంటున్న భక్తులు
ఎన్నో విశిష్టతలు ఎంతో నైపుణ్యంతో నిర్మించిన రామ మందిరం మూడు అంగుళాల చెక్కపై అరచేతి సైజులో ఉంటే ఎలా ఉంటుంది. అలాంటి దృశ్యాన్ని ఊహించుకోగలరా... అయితే ఇప్పుడు ఊహని నిజం చేస్తూ అరచేతి సైజులో అరచేతి రామ మందిర నమూనా నిర్మాణాన్ని తయారుచేసి పలువురి మన్ననులు పొందాడు ఒక వ్యక్తి.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ గా మారి ఆ ప్రాంతంలో మరోసారి రామ మందిరం విశిష్టతలను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.
ఏలూరు: అయోధ్యలో రామ మందిరంలో బాల రాముని ప్రతిష్ట కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉత్సవాల సాగింది. పల్లె, పట్టణం, ఊరు వాడ అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా రాముని ప్రతిమలే, ఎక్కడ విన్నా రామనామ స్మరణే.. రామయ్య కీర్తనలతో భారత దేశం యావత్తు ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. ఎన్నో ఏళ్ల హిందువుల కల నెరవేరిన వేళ ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో నలు దిక్కులు పిక్కటిల్లేలా దద్దరిల్లిపోయింది. అంతటి మహోన్నత చరిత్ర గల అయోధ్యలో నిర్మించిన రామా మందిర నిర్మాణంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. రామ మందిర విశిష్టతలన్ని ఇప్పటికే దేశ ప్రజలందరూ తెలుసుకున్నారు . అటువంటి ఎన్నో విశిష్టతలు ఎంతో నైపుణ్యంతో నిర్మించిన రామ మందిరం మూడు అంగుళాల చెక్కపై అరచేతి సైజులో ఉంటే ఎలా ఉంటుంది. అలాంటి దృశ్యాన్ని ఊహించుకోగలరా… అయితే ఇప్పుడు ఊహని నిజం చేస్తూ అరచేతి సైజులో అరచేతి రామ మందిర నమూనా నిర్మాణాన్ని తయారుచేసి పలువురి మన్ననులు పొందాడు ఒక వ్యక్తి.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ గా మారి ఆ ప్రాంతంలో మరోసారి రామ మందిరం విశిష్టతలను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.
ఏలూరుకు చెందిన శివప్రసాద్ సూక్ష్మ వస్తువులు తయారుచేసే కళాకారుడు. శివప్రసాద్ చిన్నతనం నుంచే పెయింటర్ కావడంతో నేమ్ బోర్డులు, స్టిక్కరింగ్ చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనూ తనకున్న డ్రాయింగ్ ఇంట్రెస్ట్ తో బియ్యం గింజల పై అక్షరాలు రాస్తూ చెక్కలపై పేర్లతో కూడిన కీచైన్లు తయారు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే చిన్న చిన్న చెక్కలపై అద్భుత సూక్ష్మ శిల్పాలను చెక్కారు. ఈ నేపథ్యంలో ఇటీవల అయోధ్యలో రామ జన్మభూమి ట్రస్ట్ నిర్మించిన రామ మందిరం నిర్మాణంపై ఆసక్తి ఏర్పడిన శివప్రసాద్ ఓ చిన్న చెక్కపై సూక్ష్మ రూపంలో దానిని ఆవిష్కరించాలనుకున్నారు. వెంటనే మూడు అంగుళాల చెక్క ముక్కను తీసుకుని తన ప్రతిభతో అచ్చం అయోధ్య రామ మందిరాన్ని పోలివున్న నమూనా మందిరాన్ని ఆ చెక్కపై తయారు చేశారు.
శివప్రసాద్ తయారుచేసిన సూక్ష్మ అయోధ్య రామ మందిరం నమూనా చూసినా స్థానికులు సేమ్ టు సేమ్ అయోధ్య లోని రామమందిరం లాగే ఉందని, దాన్ని చూసినవారు అయోధ్య రామ మందిరాన్ని చూసిన అనుభూతిని పొందుతున్నామని అంటున్నారు. సూక్ష్మ రూపంలో మూడు అంగుళాల చెక్కపై అయోధ్య రామ మందిరాన్ని నిర్మించిన శివప్రసాద్ ను పలువురు ప్రశంశలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే సూక్ష్మ రూపంలో తాను తయారుచేసిన వస్తువులకు అవార్డులు సైతం పొందాడు శివప్రసాద్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..