Red Sandal Smugglers: రెచ్చిపోయిన ఎర్రచందనం దొంగలు.. కానిస్టేబుల్‌ను కారుతో గుద్ది..

Red Sandal Smugglers: రెచ్చిపోయిన ఎర్రచందనం దొంగలు.. కానిస్టేబుల్‌ను కారుతో గుద్ది..

Anil kumar poka

|

Updated on: Feb 07, 2024 | 6:41 PM

అన్నమయ్య జిల్లా శేషాచలం ఫారెస్ట్‌లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. కూంబింగ్‌ చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిపై నుంచి కారుతో దూసుకెళ్లారు. స్మగ్లర్లను పట్టుకునేందుకు యత్నించిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని అతివేగంతో ఢీకొట్టి పరారయ్యారు. ఈ ప్రమాదంలో గణేశ్‌ అనే కానిస్టేబుల్‌ అక్కడికక్కడే చనిపోయారు. కేవీపల్లి మండలం గుండ్రేవారిపల్లి క్రాస్ దగ్గర ఈ ఘటన జరిగింది.

అన్నమయ్య జిల్లా శేషాచలం ఫారెస్ట్‌లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. కూంబింగ్‌ చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిపై నుంచి కారుతో దూసుకెళ్లారు. స్మగ్లర్లను పట్టుకునేందుకు యత్నించిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని అతివేగంతో ఢీకొట్టి పరారయ్యారు. ఈ ప్రమాదంలో గణేశ్‌ అనే కానిస్టేబుల్‌ అక్కడికక్కడే చనిపోయారు. కేవీపల్లి మండలం గుండ్రేవారిపల్లి క్రాస్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు స్మగ్లర్లను వెంటాడి పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఏడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్ గణేష్ డెడ్‌బాడీని పోస్ట్ మార్టం కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ గణేష్ మృతితో ఆసుపత్రి వద్ద ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..