AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Religious Tips: శనీశ్వరుడి అనుగ్రహం కోసం రావి చెట్టుకి ఎలా పూజ చేయాలి..? ఎప్పుడు చేయాలంటే

రావి చెట్టుకు మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు.. శాస్త్రీయ దృక్కోణంలో కూడా ఈ చెట్టు చాలా అద్భుతంగా పరిగణిస్తారు. రావి చెట్టు ప్రాణాధారమైన గాలి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. మానవులకు అవసరమైన ఆక్సిజన్ ను రావి చెట్టు అత్యధికంగా రిలీజ్ చేస్తుంది. హిందూ మత విశ్వాసం ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యం బాగోలేకపోతే  రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయడం ప్రయోజనకరం. రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

Religious Tips: శనీశ్వరుడి అనుగ్రహం కోసం రావి చెట్టుకి ఎలా పూజ చేయాలి..? ఎప్పుడు చేయాలంటే
Peepal Tree Puja
Surya Kala
|

Updated on: Feb 07, 2024 | 5:24 PM

Share

హిందూ మతంలో ప్రకృతిలోని పశువులను,  పక్షులను, మొక్కలను దైవంగా భావించి ఆరాధిస్తారు. తులసి, మర్రి,  జమ్మి వంటి అనేక చెట్లు, మొక్కలు పూజిస్తారు.. వీటిల్లో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టుపై లక్ష్మీదేవి నివసిస్తుందని హిందువుల విశ్వాసం. అందుకే శనివారం రోజున రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగించడం కూడా చాలా ముఖ్యం. హిందువుల నమ్మకం ప్రకారం చెట్లను పూజించడం వల్ల జీవితంలో సుఖ సంపదలు లభిస్తాయని విశ్వాసం. రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో రావి చెట్టుకు ఎందుకు ప్రదక్షిణ చేస్తారు?  ప్రాముఖ్యత ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

రావి చెట్టుకు మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు.. శాస్త్రీయ దృక్కోణంలో కూడా ఈ చెట్టు చాలా అద్భుతంగా పరిగణిస్తారు. రావి చెట్టు ప్రాణాధారమైన గాలి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. మానవులకు అవసరమైన ఆక్సిజన్ ను రావి చెట్టు అత్యధికంగా రిలీజ్ చేస్తుంది. హిందూ మత విశ్వాసం ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యం బాగోలేకపోతే  రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయడం ప్రయోజనకరం. రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరంలో పిత్త , వాత సమతుల్యతను కాపాడుతుంది.

  1. రావి చెట్టుకి మతపరమైన ప్రాముఖ్యత
  2. హిందూ మతం విశ్వాసాల ప్రకారం సకల దేవతలు రావి చెట్టులో నివసిస్తారు.
  3. ఇవి కూడా చదవండి
  4. ముఖ్యంగా రావి చెట్టు  శనిదేవుడు ప్రీతి కరమని నమ్మకం.
  5. ఈ చెట్టుకు నీరు సమర్పించి దీపం వెలిగించడం ద్వారా శనిదేవుడు ప్రసన్నుడై సంతోషాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు.
  6. శనీశ్వరుడు దృష్టి పడిన వ్యక్తి జీవితంలో కష్టాలు ఏర్పడతాయి.
  7. అదే సమయంలో శనీశ్వరుడు ఎవరి పట్ల అయినా సంతోషంగా ఉంటే.. అతని జీవితంలో శుభప్రదంగా సాగుతుందని నమ్మకం.
  8. ఎవరి జాతకంలో నైనా శనిదోషం ఉంటె.. అది తొలగిపోవాలంటే.. ప్రతినెలా అమావాస్య రోజున శనివారం రోజున రావి చెట్టుకు ఏడుసార్లు ప్రదక్షిణలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు.
  9. అంతేకాకుండా రావి చెట్టు దగ్గర ఆవనూనె దీపం వెలిగించడం కూడా శుభప్రదం. ఈ పరిహారం చేయడం వల్ల శనిగ్రహ కోపం నుండి ఉపశమనం పొందుతారు.

మానసిక ప్రశాంతతను ఇచ్చే రావి చెట్టు ..

మనశ్శాంతి కోసం రావి చెట్టును కూడా పూజిస్తారు. ప్రదక్షిణలు చేస్తారు. బ్రహ్మ ముహూర్త సమయంలో రావి  చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు. భయం లేదా చెడు ఆలోచనలు మనస్సులోకి రావు. మరోవైపు రావి చెట్టుకు ప్రతిరోజూ ప్రదక్షిణలు చేస్తే, ప్రజలు ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం పొందుతారు. జీవితంలో ఏర్పడిన కష్టాల నుండి విముక్తి పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు