Ramakrishna Math: 50 వసంతాలు పూర్తి చేసుకున్న రామకృష్ణ మఠం.. ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ
పశ్చిమ బెంగాల్ లోని బేలూర్ మఠానికి అనుబంధంగా భారతదేశంలో, విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్నాయి. భాగ్యనగరంలో 1973 లో రామ కృష్ణ మఠం ఏర్పాట్లు అయింది. దోమల్ గూడలో ఉన్న ఈ మఠం 2023 డిసెంబర్ లో 50 సంవత్సరాలను పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలను జరుపుకోవడానికి సిద్ధమయింది. రామకృష్ణ మఠం స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ నెల 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ హాజరై ఆధ్యాత్మిక సంబరాలను జయప్రదం చేయమని కోరుతుంది.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస పురుషుల కోసం ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం రామ కృష్ణ మఠం. ప్రభుత్వం గుర్తింపు పొందిన సేవా సంస్థ దేశ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఆధ్యాత్మిక సేవలను అందిస్తోన్న రామ కృష్ణ మఠం ఈ ఏడాది స్వర్ణోత్సవాలను జరుపుకోవడానికి రెడీ అవుతుంది. పశ్చిమ బెంగాల్ లోని బేలూర్ మఠానికి అనుబంధంగా భారతదేశంలో, విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్నాయి. భాగ్యనగరంలో 1973 లో రామ కృష్ణ మఠం ఏర్పాట్లు అయింది.
దోమల్ గూడలో ఉన్న ఈ మఠం 2023 డిసెంబర్ లో 50 సంవత్సరాలను పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలను జరుపుకోవడానికి సిద్ధమయింది. రామకృష్ణ మఠం స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ నెల 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ హాజరై ఆధ్యాత్మిక సంబరాలను జయప్రదం చేయమని కోరుతుంది.
రామకృష్ణ మఠానికి అనుబంధ సంస్థగా రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యుడు స్వామివికానంద రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేశారు. ఈ జంట సంస్థలు ప్రజలకు అనేక సేవలను అందిస్తున్నాయి. విద్య వైద్య సేవలతో పాటు భాషా నైపుణ్యాన్ని పెంపొందించేలా శిక్షణ ఇవ్వడం, ఆధ్యాత్మిక చింతనతో కూడిన పుస్తకాల ప్రచురణ, మానవ వికాస కేంద్రం నిర్వహణ, గ్రామ సంక్షేమం వంటి విభిన్న కార్యక్రమాలతో ప్రజలకు ఎనలేని సేవలందిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..