Chandrababu: పొత్తుల రాఖీ కట్టేదెప్పుడు..? చంద్రబాబు సంచలన వ్యాఖ్యల వెనుక ఆంతర్యమిదేనా..
TDP Chief Chandrababu: సమయం లేదు మిత్రమా.. శరణమా.. రణమా.. ఇది బాలకృష్ణ సినిమాలోని డైలాగ్.. కానీ, ఇప్పుడు ఇదే డైలాగ్ సూటయ్యే విధంగా.. రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సమయం లేదు మిత్రమా అంటూ.. పొత్తుల కోసం సంప్రదింపులు చేస్తున్నాయి... పొత్తు పొడిస్తే ఓకే లేకుంటే రణమే అంటూ ముందుకు సాగుతున్నాయ్.. మరో మూడు నెలల్లో తెలంగాణలో..
TDP Chief Chandrababu: సమయం లేదు మిత్రమా.. శరణమా.. రణమా.. ఇది బాలకృష్ణ సినిమాలోని డైలాగ్.. కానీ, ఇప్పుడు ఇదే డైలాగ్ సూటయ్యే విధంగా.. రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సమయం లేదు మిత్రమా అంటూ.. పొత్తుల కోసం సంప్రదింపులు చేస్తున్నాయి.. పొత్తు పొడిస్తే ఓకే లేకుంటే రణమే అంటూ ముందుకు సాగుతున్నాయ్.. మరో మూడు నెలల్లో తెలంగాణలో.. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలతో పాటు.. ఏపీలో ఎన్నికలు.. దీంతో ఇటు తెలంగాణ.. అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి.. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం స్పీడు పెంచారు. ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై కూడా ఆయన ఫోకస్ చేశారు. అయితే, ఏపీలో జనసేనతోపాటు బీజేపీ..? లేక మరెదైనా పార్టీతో జట్టు కట్టాలా అనే వ్యూహంతో ముందుకుసాగుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో పరిస్థితులను అంచనా వేస్తూ.. బీజేపీ అగ్రనేతలతో కూడా బాబు భేటీ అవుతుండటం రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఉన్నారు. దీంతో టీడీపీ.. బీజేపీ మధ్య పొత్తు పొడుస్తున్నట్లు వార్తలొచ్చాయ్.. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు తాము సానుకూలమేనంటూ తేల్చేసిన చంద్రబాబు.. ఎవరితోనైనా పొత్తులకు ఆస్కారం ఉంటుందంటూ పేర్కొన్నారు.
పొత్తు ఎవరితో అనేది ఎన్నికల సమయంలో మీకే తెలుస్తుందంటూ ఓ క్లారిటీ కూడా ఇచ్చారు. మంగళవారం చంద్రబాబు మాట్లాడుతూ.. పొత్తులు టీడీపీకి కొత్త కాదు.. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, NDA ఎన్నో చూశాం.. ఏపీని పునర్‌నిర్మాణం చేసే క్రమంలో కేంద్రంతో ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి.. ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామంటూ తెలిపారు.
అంతేకాకుండా తెలంగాణలో పోటీపై కూడా చంద్రబాబు మాట్లాడారు. దీనిపై కమిటీ వేశామంటూ తెలిపారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు గురించి మాట్లాడుతూ.. సమయం మించిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మరో విషయం కూడా మాట్లాడారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా.. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీతోపాటు తెలంగాణలో కూడా చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు మాటల సందర్భం ఏంటి.. ఆయన మాటల ఆంతర్యమేంటి అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..