Vizag Steel Plant: ఆ క్రెడిట్ మొత్తం ఆయనకే.. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై లక్ష్మీనారాయణ రియాక్షన్
విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కేంద్రం వెనకడుగు వేయడంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఆ క్రెడిట్ అంతా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇచ్చేశారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఇంతకీ ఆయన ఏం ట్వీట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..

విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కేంద్రం వెనకడుగు వేయడంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఆ క్రెడిట్ అంతా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇచ్చేశారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఇంతకీ ఆయన ఏం ట్వీట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..
వీవీ లక్ష్మీనారాయణ అంటే గుర్తు పట్టడానికి కాస్త ఆలస్యం అవుతుంది. అదే జేడీ లక్ష్మీనారాయణ అంటే టకీమని గుర్తొస్తారు. ఆ పేరు ఏపీ, తెలంగాణలో అంతటి సంచలనం సృష్టించింది మరి. అయితే, ఇప్పుడాయన చేసిన ట్వీట్ కూడా సంచలనంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని పరోక్షంగా చెప్పేశారు.




‘ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్‌లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశీలినకు బృందాన్ని పంపి సరైన చర్యలు తీసుకున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రైవేటీకరణకు వెళ్లడానికి బదులుగా.. ఆర్ఐఎన్ఎల్‌ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేందుకు దోహదపడింది. తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నాం.’ అంటూ లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.
రాజకీయ ప్రకంపనలు..
ఈ ట్వీట్ ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఆయన్ను బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించిన నేపథ్యంలో.. ఆయన కేసీఆర్‌కు క్రెడిట్ ఇస్తూ ట్వీట్ చేయడం ఆసక్తి రేపుతోంది. మరి భవిష్యత్‌లో లక్ష్మీనారాయణ దారి ఎటువైపు ఉంటుందో వేచి చూడాలి.
వీవీ లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ ఇదే..
Thanks to Sri. KCR garu #KCR for taking steps to participate in EOI of Vizag Steel by sending a team.This has made the Govt. of India for the time being not to go in for privatisation & instead strengthen RINL. Govt of Telangana should participate in the bid . @KTRBRS @BRSHarish
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) April 13, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..