Andhra Pradesh: ఏపీలో పొత్తులపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్.. ఏమన్నారంటే
ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకే పొత్తులు పెట్టుకుంటామని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ప్రతిపాదన చేశారని అన్నారు. అయితే పవన్ ప్రతిపాదనను కూడా జాతీయ నాయకత్వానికి తెలియజేశామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకే పొత్తులు పెట్టుకుంటామని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ప్రతిపాదన చేశారని అన్నారు. అయితే పవన్ ప్రతిపాదనను కూడా జాతీయ నాయకత్వానికి తెలియజేశామని పేర్కొన్నారు. ఆయన కూడా ఢిల్లీ బీజేపీ పెద్దలకు చెప్పారని తెలిపారు. కానీ పొత్తులు పెట్టుకోవాల వద్దా అనే అంతిమ నిర్ణయం జాతీయ నాయకత్వానిదే అని స్పష్టం చేశారు. వాళ్లు చెప్పిందే తాము పాటిస్తామని వెల్లడింటారు.
ఇదిలా ఉండగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కూడా జీవీఎల్ స్పందించారు. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తీర్పు లేనప్పటికీ బీజేపీ గత ఎన్నికల్లో సాధించిన 36% ఓట్ల శాతాన్నే ప్రస్తుత ఎన్నికల్లో కూడా సాధించినదని, బీజేపీ ప్రజాదరణలో ఏమాత్రం మార్పు లేదంటూ వ్యాఖ్యానించారు. కేవలం జేడీఎస్ పార్టీకి తగ్గిన ఓట్ల శాతం కాంగ్రెస్ కు కలవడం వల్ల మాత్రమే కర్ణాటకలో కాంగ్రెస్ ఈ ఫలితాలు సాధించగలిగిందని పేర్కొన్నారు. బీజేపీ ఓటు బ్యాంకు పూర్తిగా ఎప్పటిలాగే స్థిరంగా నిలిచి ఉందని తెలిపారు. స్థానిక అంశాల ప్రాతిపదిక ఆధారంగా మెజార్టీ సాధించే ఇటువంటి ఎన్నికలు ఇతర రాష్ట్రాలపై ప్రభావాన్ని చూపవన్నారు. ప్రతి రాష్ట్రానికి వాటికి సంబంధించిన స్థానిక సమస్యలు మాత్రమే ప్రధాన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..