AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anakapalle: పెన్సిల్ మొనపై ‘మాతృ ప్రేమ’.. అద్భుతం.. ఔరా అనిపిస్తున్న కళా ఖండం..

అమ్మ లేకపోతే జీవం లేదు.. అమ్మ లేకపోతే గమనం లేదు.. అమ్మ లేకపోతే సృష్టే లేదు. అందుకే అమ్మ దైవంతో సమానం. అమ్మ ప్రేమ అనంతమైనది. చిరస్థాయిగా నిలిచిపోతుంది . ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్ని ప్రపంచ వ్యాప్తంగా మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలుసు కదా..!

Anakapalle: పెన్సిల్ మొనపై 'మాతృ ప్రేమ'.. అద్భుతం..  ఔరా అనిపిస్తున్న కళా ఖండం..
Mother Micro Art
Ram Naramaneni
|

Updated on: May 14, 2023 | 12:03 PM

Share

అమ్మ అంటే… అనుబంధం.. అనురాగం.. ఆత్మీయ‌త‌..! అన్నింటికీ మించి.. అమ్మంటే మ‌న‌కు ముందుగా స్ఫురించేది.. ప్రేమ‌. సృష్టిలో అమ్మ పంచే ప్రేమ వ‌ర్ణించ‌రానిది. అమ్మ ప్రేమ అనంతం. అటువంటి తల్లి ప్రేమను చాటి చెబుతూ అనకాపల్లి జిల్లాలో ఓ సూక్ష్మ కళాకారుడు అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు. పెన్సిల్ మొనపై తల్లి బిడ్డల శిల్పాన్ని చెక్కి ఔరా అనిపించాడు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దొడ్డిగోలు గ్రామం అది. ఈ గ్రామంలో వెంకటేష్ అనే కళాకారుడు సూక్ష్మ కళాఖండాలు రూపొందిస్తూ ఉంటాడు. ప్రతిసారి.. సందర్భానికి అనుగుణంగా సమాజానికి ఒక చక్కని మెసేజ్ ఇస్తూ అనేక మహానుభావుల విగ్రహాలు చెక్కి చిన్న వస్తువులపై తనదైన శైలిలో చెక్కి ప్రత్యేకమైన శిల్పిగా పేరుగాంచాడు.

తాజాగా మాతృదినోత్సవం సందర్భంగా తల్లిపై ఉన్న ప్రేమను చాటి చెబుతూ పెన్సిల్ మొన పై అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు. 8 మిల్లీమీటర్ల వెడల్పు, పది మిల్లీమీటర్ల ఎత్తుతో రూపొందించిన ఈ కళాఖండం తయారు చేసేందుకు మూడు గంటల సమయం పట్టింది. ముఖ్యంగా తల్లి తన బిడ్డను ఏవిధంగా తన ప్రాణానికి ప్రాణంగా పెంచుతుందో చూపిస్తూ చెక్కిన చిత్రం ఔరా అనిపిస్తుంది.

మాతృదినోత్సవం సందర్భంగా ఈ భూమిపై ఉన్న తల్లులందరకు ఈ మాత్రమూర్తి ప్రేమను అంకితం చేస్తున్నానని కళాకారుడు వెంకటేష్ పేర్కొన్నాడు. మాతృ ప్రేమను సూక్ష్మ కళాఖండంలో కళ్లకు కట్టినట్టు చెక్కిన వెంకటేష్ ప్రతిభను అభినందిస్తున్నారు.

Mother Art

(ఖాజా, టీవీ9 తెలుగు, వైజాగ్)

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!