BJP-Janasena: విజయవాడ వెస్ట్ కోసం పట్టుబడుతున్న బీజేపీ – జనసేన.. పోతిన మహేష్ పరిస్థితేంటి..?
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ, రోజు రోజుకీ విజయవాడ వెస్ట్ సీట్ కాకరేపుతోంది. జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన మహేష్‌కే టికెట్ ఇవ్వాలంటూ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. ఈ వివాదం కాస్త రోజు రోజుకు ముదురుతోంది. ఒకవైపు అసంతృప్తిగళం వినిపిస్తూనే మరోవైపు ఆత్మీయ సమావేశాలతో తమ నిరసన తెలియజేస్తున్నారు జనసేన శ్రేణులు.

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ, రోజు రోజుకీ విజయవాడ వెస్ట్ సీట్ కాకరేపుతోంది. జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన మహేష్‌కే టికెట్ ఇవ్వాలంటూ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. ఈ వివాదం కాస్త రోజు రోజుకు ముదురుతోంది. ఒకవైపు అసంతృప్తిగళం వినిపిస్తూనే మరోవైపు ఆత్మీయ సమావేశాలతో తమ నిరసన తెలియజేస్తున్నారు జనసేన శ్రేణులు. మొదటి లిస్టు ప్రకటన తర్వాత పవన్ కల్యాణ్ పిలిచి సీటు తమకే వస్తుందని రెండో లిస్టులో ప్రకటిస్తానంటూ హామీ ఇచ్చారని, ఇప్పుడు సీటు బీజేపీకే వెళ్ళినట్లు ప్రచారం జరుగుతుందంటూ మహేష్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎంతోకాలంగా పార్టీ జెండా మోసి పవన్ హామీ తర్వాత ప్రజల్లో ప్రచారం చేస్తున్నట్లు మహేష్ చెబుతున్నారు. పార్టీ నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో టికెట్ తనకే ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోజుకో రకంగా యువత, వీర మహిళలు ఆందోళనను చేస్తూనే ఉన్నారు. ఇక, తాజాగా దుర్గమ్మ గుడిలో 108 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మారో పక్క బీజేపీ, జనసేన పార్టీల నేతలు ఆత్మీయ సమావేశాలు పోటా పోటీగా పెడుతున్నారు.
పవన్ పార్టీ పెట్టినప్పటి నుండి పవన్ వెంటే మహేష్ వున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యక్రమం తలపెట్టినా, విజయవాడ కేంద్రంగానే జరిగేది. NTR జిల్లా వ్యాప్తంగా విజయవాడ అర్బన్ లో జనసేన బలంగా ఉన్న ఏకైక ప్లేస్ విజయవాడ వెస్ట్ మాత్రమే. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసిన మహేష్ 15 శాతం ఓటు బ్యాంక్ సంపాదించారు. నగరాల సామాజిక వర్గానికి చెందిన పోతిన మహేష్‌కే పార్టీ టికెట్ వస్తుందని మొదటి నుండి అందరూ భావించారు. అయినప్పటికీ పొత్తు చర్చల తర్వాత సెంట్రల్ సీటు బీజేపీకి కేటాయించనట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో మహేష్ వర్గీయులు ఆందోళన బాటపట్టారు.
మరోవైపపు బీజేపీలో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు అడ్డురీ శ్రీరామ్ రేసులో వుండగా, మాజీ అధ్యక్షుడు అబ్బూరి శ్రీరామ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు పోటీ పడుతూ వుండగా తాజాగా ఆర్యవైశ్య నాయకుడు వక్కలగడ్డ భాస్కరరావు తన అభిమానులతో ఆత్మీయ సమావేశం పెట్టి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బరిలో ఉంటానంటూ చెప్పొకొచ్చారు.
ఇదిలావుంటే, విజయవాడ వెస్ట్‌లో ఎక్కువగా మైనార్టీలు ఉండటంతో ఎవరికి ఇస్తే ఎంత ప్రయోజనం అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికీ వైసీపీ నుండి అసిఫ్ బరిలో వుండగా, ఇప్పటి వరకు వెస్ట్ లో యాక్టివ్‌గా లేని బీజేపీకి టికెట్ ఇస్తే మైనార్టీ ఓట్లు పూర్తిగా వైసీపీకి పడే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలా అని అక్కడున్న బ్రాహ్మీన్, వైశ్య, మర్వాడి ఓట్లతో గెలిచే అవకాశం లేదట. దాంతో ఇరు పార్టీ నేతలు ఇదే స్థానంపై మరోసారి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటి వరకు ఏ పార్టీ నుండి అధికారిక ప్రకటన రాకపోవటంతో అటు బీజేపీ ఇటు జనసేన ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇందులో ఎవరు ఎవరి కోసం త్యాగం చేస్తారు అనేది ఆసక్తిగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
