AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కర్రీ పాయింట్‌లో పప్పు తేలేదని.. అన్న కొడుకుని చంపిన చిన్నాన్న

మనిషి క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కర్రీ పాయింట్‌కు వెళ్లి పప్పు తీసుకురాలేదని కోపంతో సొంత అన్న కొడుకును కాటికి పంపించాడు ఓ దుర్మార్గుడు.. ఈ ఘటన కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం నగరిగుట్టలో చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Andhra Pradesh: కర్రీ పాయింట్‌లో పప్పు తేలేదని.. అన్న కొడుకుని చంపిన చిన్నాన్న
Murder
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Mar 19, 2024 | 8:16 PM

Share

మనిషి క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కర్రీ పాయింట్‌కు వెళ్లి పప్పు తీసుకురాలేదని కోపంతో సొంత అన్న కొడుకును కాటికి పంపించాడు ఓ దుర్మార్గుడు.. ఈ ఘటన కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం నగరిగుట్టలో చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

కన్న కొడుకు రెడ్డి బాబును కర్రీ పాయింట్‌కి వెళ్లి పప్పు తీసుకుని రమ్మని చిన్నాన్న చెప్పాడు. అందుకు బాబు నిరాకరించాడు. దీంతో ఎదురు సమాధానం చెప్పాడని ఆగ్రహానికి లోనైనా చిన్న మల్లికార్జున అన్న కొడుకు రెడ్డి బాబుపై చేయి చేసుకున్నా.డు అయితే కొట్టే దెబ్బలు గట్టిగా తగలడంతో అక్కడికక్కడే రెడ్డి బాబు కుప్పకూలిపోయాడు. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా అన్న కొడుకును ఇంట్లోనే సంచిలో కట్టి మూలన పెట్టాడు మల్లికార్జున.

ఇదిలావుంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళిన రెడ్డి బాబు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ఇళ్ళల్లో వెతికారు. చివరికి ఇంటి లోపల మూలన గోనె సంచిలో పెట్టిన ఒక మూట కనపడటంతో అనుమానం వచ్చిన స్థానికులు తల్లిదండ్రులు తెరిచి చూడగా రెడ్డి బాబు విగతజీవిగా కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీన బాబును స్థానిక పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళగా, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించినట్లు స్థానికులు తెలిపారు. అన్యం పున్యం ఎరుగని పసివాడు బలికావడం పట్ల స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

అయితే క్షణికావేశంలో చేశాడా లేదా కావాలనే చేశాడా అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. 9వ తరగతి చదువుతున్న రెడ్డి బాబు ఆకస్మాత్తుగా ఇలా చనిపోవడంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు