Andhra Pradesh: శ్రీశైలం క్యూలైన్స్ వద్ద అయ్యప్ప స్వాముల ఆందోళన.. ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు..
వీవీఐపీల సేవలో శ్రీశైలం అధికారులు తపిస్తూ... సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తు, దేవుడికి దూరం చేస్తున్నారని అయ్యప్ప భక్తులు మండిపడ్డారు. దర్శనం ఆలస్యం అవడంతో శ్రీశైలం క్యూలైన్స్ వద్ద అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయసాగారు. అసలేం జరిగిందంటే.. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఆలయ క్యూలైన్ లో అయ్యప్పస్వామి మలధారణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి క్యూలో గంటల తరబడి ఎదురూ చూస్తున్న త్వరగతిన..
శ్రీశైలం, నవంబర్ 5: వీవీఐపీల సేవలో శ్రీశైలం అధికారులు తపిస్తూ… సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తు, దేవుడికి దూరం చేస్తున్నారని అయ్యప్ప భక్తులు మండిపడ్డారు. దర్శనం ఆలస్యం అవడంతో శ్రీశైలం క్యూలైన్స్ వద్ద అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయసాగారు. అసలేం జరిగిందంటే.. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఆలయ క్యూలైన్ లో అయ్యప్పస్వామి మలధారణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి క్యూలో గంటల తరబడి ఎదురూ చూస్తున్న త్వరగతిన దర్శనానికి అనుమతించడం లేదని మండిపడ్డారు.
ఓపిక నశించిన అయ్యప్ప స్వాములు ఈవో డౌన్ డౌన్ అంటూ క్యూ లైన్స్ దగ్గర నినాదాలు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా శ్రీశైలం క్షేత్రానికి స్వాములు వచ్చారు. అమ్మవారి దర్శనం త్వరగతిన పూర్తి చేసుకొని వారి వారి గ్రామాలకు వెళ్లాలని దర్శనం నిమిత్తం రూ.150 టికెట్స్ తీసుకొని గంటల తరబడి క్యూ లైన్ లలో ఎదురు చూడసాగారు.
అయితే దర్శనం కోసం వేచి ఉన్న తమను అనుమతించకుండా వీఐపీలను అనుమతించ సాగారని స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే స్పర్శ దర్శనాలు, బ్రేక్ దర్శనాలను ఎక్కువ మోతాదులో పంపిస్తుండడంతో క్యూలైన్లు ఆపినట్టు సమాచారం. గంటల తరబడి స్వాములకు చేరడంతో ఆగ్రహానికి లోనై క్యూ లైన్ లోనే ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.