Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Michaung: ఏపీలో తుఫాన్ బీభత్సం.. రైతుల కంట నీరు తెప్పిస్తున్న వర్షాలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలంలో తుఫాన్ ప్రభావంతో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. పామర్రులో నీట మునిగిన ధాన్యం రాశులను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ పరిశీలించారు. నీట మునిగిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించారు మంత్రి చెల్లుబోయిన.

Cyclone Michaung: ఏపీలో తుఫాన్ బీభత్సం.. రైతుల కంట నీరు తెప్పిస్తున్న వర్షాలు
Ap
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 05, 2023 | 6:48 PM

మిచౌంగ్‌ తుఫాన్ బీభత్సం దెబ్బకు ఏపీలోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కారణముగా రైతులు భారీగా నష్టపోయారు. పంటపొలాలు మొత్తం నీటితో నిండిపోయాయి. ఈదురు గాలులు కారణంగా భారీ వృక్షాలు నేలకూలాయి. దాంతో కొన్ని చోట్ల విద్యుత్ కు అంతరాయం కలిగింది. పంటల్లో నీరు చేరడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

  1. ఏపీలో మిచౌంగ్‌ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కృష్టా జిల్లాలో వరి పనలు నీట మునిగాయి. పంట నష్టంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
  2. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలంలో తుఫాన్ ప్రభావంతో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. పామర్రులో నీట మునిగిన ధాన్యం రాశులను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ పరిశీలించారు. నీట మునిగిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించారు మంత్రి చెల్లుబోయిన.
  3. మిచౌంగ్ తుపాను కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. లక్షల్లో పెట్టుబడి పెట్టిన పంట నీటి పాలు కావడంతో.. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
  4. మిచౌంగ్ తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పొగాకు, శెనగ, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కో ఎకరానికి 40వేల వరకు ఖర్చు చేశామంటూ ఆవేదన చెందుతున్నారు.
  5. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో మిచౌంగ్ తుఫాన్‌ ప్రభావంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షానికి జిల్లాలో వేల ఎకరాల్లో అరటిపంట, తమలపాకు తోట, బొప్పాయి పంట నేలకొరిగింది.
  6. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని పలు గ్రామాల్లో వందలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. రైతుల్ని ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ధూళిపాళ్ల నరేంద్ర.
  7. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని పలు గ్రామాల్లోనూ వరి పంట భారీగా దెబ్బతిన్నది. వివిధ రకాల పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పంట నష్టం జరగడంతో ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు.
  8. నెల్లూరు జిల్లాలో మిచౌంగ్‌ తుఫాన్‌ రైతాంగానికి అపార నష్టం మిగిల్చింది. ముఖ్యంగా.. అనంతసాగరం మండలం అగ్రహారంలో వందలాది ఎకరాల మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. మిర్చి పంట దెబ్బతినడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.
  9. బాపట్ల జిల్లాలో పంట పొలాలను పరిశీలించారు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. అనంతరం.. తుఫాన్‌ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు ఎంపీ మోపిదేవి.