AP Panchayat Elections Result: ఏపీలో మూడో దశ పోలింగ్‌లో ఏ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని పంచాయతీలు దక్కించుకుంది.. పూర్తి వివరాలు

AP Panchayat Elections Result: ఏపీలో పంచాయతీ ఎన్నికల పర్వం కొనసాగుతోంది. బుధవారం మూడో దశ పోలింగ్‌ పూర్తయి ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే మూడో దశలో ఏ జిల్లాల్లో...

AP Panchayat Elections Result: ఏపీలో మూడో దశ పోలింగ్‌లో ఏ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని పంచాయతీలు దక్కించుకుంది.. పూర్తి వివరాలు
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 21, 2021 | 8:21 AM

AP Panchayat Elections Result: ఏపీలో పంచాయతీ ఎన్నికల పర్వం కొనసాగుతోంది. బుధవారం మూడో దశ పోలింగ్‌ పూర్తయి ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే మూడో దశలో ఏ జిల్లాల్లో ఏయే పార్టీకి ఎన్ని ఏకగ్రీవాలు, ఎన్ని గెలుపొందాయో వైఎస్సార్‌ సీపీ ప్రకటించింది. ఈ మూడో దశలో ఎక్కువ పంచాయతీలు వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ తెలిపిన వివరాల ప్రకారం..

శ్రీకాకుళం జిల్లా:

ఈ జిల్లాలో మొత్తం 293 పంచాయతీలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా, అందులో 45 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 248 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. అందులో వైసీపీ సభ్యులు ఏకగ్రీవాలు కాగా, మొత్తం ఏక్రగీవాలతో కలిపి 221 పంచాయతీలు దక్కించుకుంది వైసీపీ. ఇక వైసీపీ రెబల్స్‌ 13 కాగా, టీడీపీ గెలిచిన పంచాయతీలు, ఏకగ్రీవాలు కలిపి 54 పంచాయతీలు గెలుచుకుంది. ఇక బీజేపీ ఈ జిల్లాలో ఒక్కసీటు కూడా దక్కించుకోలేకపోయింది. ఇతరులు నాలుగురు గెలుపొందారు.

విజయనగరం జిల్లా:

ఈ జిల్లాలో మొత్తం 244 పంచాయతీలకు నోటిఫికేషన్‌ వెలువడగా, 37 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 207 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వైసీపీ ఏకగ్రీవాలు 34 ఉండగా, గెలిచిన పంచాయతీలు, ఏకగ్రీవాలు కలిపి వైసీపీ 185 పంచాయతీలను కైవసం చేసుకుంది. వైసీపీ రెబల్స్‌ అభ్యర్థులు 23 మంది గెలుపొందారు. టీడీపీ ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 36 పంచాయతీలు దక్కించుకుంది. ఇతరులు 4 గెలుపొందారు.

విశాఖపట్నం జిల్లా:

ఈ జిల్లాలో మొత్తం 244 పంచాయతీలకు నోటిఫికేషన్‌ వెలువడగా అందులో 6 ఏక్రీవం అయ్యాయి. 237 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. అందులో వైసీపీ 5 ఏకగ్రీవాలతో పాటు మొత్తం 122 కైవసం చేసుకుంది. వైసీపీ రెబల్స్‌ 58 మంది కైవసం చేసుకున్నారు. ఇక టీడీపీ ఏకగ్రీవాలతో పాటు మొత్తం 46 పంచాయతీలు గెలుపొందగా, బీజేపీ 3 పంచాయతీలు దక్కించుకోగా, జనసేన 1 స్థానం దక్కించుకుంది. ఇతరులు 13 మంది గెలుపొందారు.

తూర్పు గోదావరి జిల్లా:

ఈ జిల్లాలో మొత్తం 186 పంచాయతీకు నోటిఫికేషన్‌ జారీ చేయగా, 14 ఏకగ్రీవాలు కాగా, 172 పంచాయతీలకు పోలింగ్‌ నిర్వహించారు. వైసీపీ ఏకగ్రీవాలు 10తో పాటు మొత్తం 131 పంచాయతీలు దక్కించుకుంది. వైసీపీ రెబల్స్‌ 10. ఇక టీడీపీ మొత్తం ఏకగ్రీవాలతో పాటు 26 పంచాయతీలు దక్కించుకుంది. బీజేపీ ఒక్క పంచాయతీ కూడా దక్కించుకోలేదు. ఇతరులు 19 మంది గెలుపొందారు.

పశ్చిమ గోదావరి జిల్లా :

ఈ జిల్లాలో మొత్తం 178 పంచాయతీలకు నోటిఫికేషన్‌ జారీ కాగా, 14 ఏకగ్రీవం అయ్యాయి. 163 పంచాయతీలకు ఎన్నికలు జరుగగా, వైసీపీ 11 ఏకగ్రీవాలు, రెబల్స్‌ 18, మొత్తం 111 పంచాయతీలు గెలుచుకుంది. టీడీపీ ఏకగ్రీవాలతో పాటు మొత్తం 36 గెలుపొందగా, జనసేన 1, ఇతరులు 11 గెలుపొందాయి.

కృష్ణా జిల్లా:

ఈ జిల్లాలో మొత్తం 225 పంచాయతీలకు నోటిఫికేషన్‌ వెలువడగా, 29 ఏకగ్రీవాలు జరుగగా, మిగతా 196 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో వైసీపీ 26 ఏకగ్రీవాలు, రెబల్స్‌ 10, మొత్తం ఏకగ్రీవాలతో కలిపి 149 పంచాయతీలు గెలుచుకుంది. ఇక టీడీపీ ఏకగ్రీవాలతో పాటు 48 పంచాయతీలు గెలుచుకుంది. ఇక జనసేన 15, ఇతరులు 1 స్థానం చొప్పున గెలుచుకున్నారు.

గుంటూరు జిల్లా :

ఈ జిల్లాలో మొత్తం 134 స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువగా, 98 ఏకగ్రీవాలు జరిగాయి. ఇక మిగతా 36 స్థానాలకు ఎన్నికలు జరుగగా, అందులో వైసీపీ 98 ఏకగ్రీవం సాధించగా, మొత్తం 130 పంచాయతీలు దక్కించుకుంది. టీడీపీ మూడు పంచాయతీలు దక్కించుకోగా, జనసేన ఒక పంచాయతీ దక్కించుకుంది.

ప్రకాశం జిల్లా:

ఈ జిల్లాలో 299 పంచాయతీలకు నోటిఫికేషన్‌ జారీ కాగా, 62 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 236 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. అందులో 59 పంచాయతీలు వైసీపీ ఏకగ్రీవాలు, 4 రెబల్స్‌, మొత్తం 247 పంచాయతీలు దక్కించుకుంది. టీడీపీ ఏకగ్రీవాలతో పాటు47 పంచాయతీలు దక్కించుకుంది.

నెల్లూరు జిల్లా:

ఈ జిల్లాలో మొత్తం 342 స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడగా, 75 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 267 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో వైసీపీ 72 ఏకగ్రీవాలు, రెబల్స్‌1, మొత్తం 279 పంచాయతీలు కైవసం చేసుకుంది. టీడీపీ ఏకగ్రీవాలతో పాటు 57 పంచాయతీలు దక్కించుకుంది. ఇక ఇతరులు ఐదుగురు గెలుపొందారు.

చిత్తూరు జిల్లా:

ఈ జిల్లాలో 264 పంచాయతీలకు నోటిఫికేషన్‌ వెలువడగా, 91 ఏకగ్రీవాలు జరిగాయి. 173పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో వైసీపీ 91 ఏకగ్రీవాలు, రెబల్స్‌7 గెలుపొందగా, మొత్తం 230 పంచాయతీలు దక్కించుకుంది. టీడీపీ ఏకగ్రీవాలతో పాటు 27 పంచాయతీలు గెలుచుకుంది.

అనంతపురం జిల్లా:

ఈ జిల్లాలో మొత్తం 379 పంచాయతీలకు నోటిఫికేషన్‌ వెలువడగా, 23 ఏకగ్రీవాలు జరిగాయి. అందులో 356 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, వైసీపీ 22 ఏకగ్రీవాలు, రెబల్స్‌ 26, మొత్తం 276 పంచాయతీలు దక్కించుకుంది. టీడీపీ ఏకగ్రీవాలతో పాటు 74 పంచాయతీలు సాధించాయి. ఇరులు 2.

కర్నూలు జిల్లా :

ఈ జిల్లాలో 246 పంచాయతీలకు నోటిఫికేషన్‌ వెలువడగా, 26 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో 219 పంచాయతీలకు ఎన్నికలు జరుగగా, వైసీపీ ఏకగ్రీవాలు 22, రెబల్స్‌ 6 , మొత్తం 183 పంచాయతీలు దక్కించుకుంది. టీడీపీ ఏకగ్రీవాలతో పాటు మొత్తం 50 పంచాయతీలు గెలుచుకున్నాయి. ఇక బీజేపీ 1, ఇతరులు 5 ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ కడప జిల్లా :

ఈ జిల్లాలో మొత్తం 188 పంచాయతీలకు నోటిఫికేషన్‌ వెలువడగా, 59 ఏకగ్రీవం అయ్యాయి. 129 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో వైసీపీ 55 ఏకగ్రీవం కాగా, రెబల్స్‌ 4, మొత్తం 160 పంచాయతీలు దక్కించుకుంది. ఇక టీడీపీ మొత్తం ఏకగ్రీవాలతో పాటు 23 పంచాయతీలు, జనసేన 1 దక్కించుకుంది.

కాగా, విశాఖ -1, ప్రకాశం -1 పశ్చిమ గోదావరి -1, అనంతపురం -1, శ్రీకాకుళం -1 మొత్తం 5 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాల్సి ఉంది. శ్రీకాకుళంలో ఒక పంచాయతీలో బ్యాలెట్‌ బ్యాక్స్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లడంతో కౌంటింగ్‌ నిలిచిపోయింది. అనంతపురం జిల్లాలో ఒక అభ్యర్థి చనిపోవడంతో పోలింగ్‌ నిలిచిపోయింది.

AP Panchayat Elections 3rd phase results 1

Also Read: పోలీస్‌ సిబ్బందిని అభినందించిన ఏపీ డీజీపీ.. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారన్న గౌతమ్‌ సవాంగ్‌

AP Panchayat Elections 2021 live: ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు.. నాలుగో విడత పోలింగ్ ప్రారంభం..