గృహనిర్మాణ పథకంపై సీఎం జగన్‌ సమీక్ష.. పేదల ఇళ్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్ పేదల గృహనిర్మాణ పథకంపై ఉన్నతాధికారులతో సీఎం జగన్మోహన్‌రెడ్డి సమీక్షించారు. వీలైనంత త్వరగా ఇళ్లను పూర్తి చేసి..

గృహనిర్మాణ పథకంపై సీఎం జగన్‌ సమీక్ష.. పేదల ఇళ్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి ఏమన్నారంటే..
cm-jagan-
Follow us

|

Updated on: Feb 18, 2021 | 5:45 PM

ఆంధ్రప్రదేశ్ పేదల గృహనిర్మాణ పథకంపై ఉన్నతాధికారులతో సీఎం జగన్మోహన్‌రెడ్డి సమీక్షించారు. వీలైనంత త్వరగా ఇళ్లను పూర్తి చేసి ప్రజలకు అందించాలని అధికారులను ఆదేశించారు. వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో వేగంగా ఇళ్ళ నిర్మాణాలు, కాలనీల్లో కల్పించనున్న మౌలిక సదుపాయాలపై అధికారులతో సీఎం జగన్‌ సమగ్రంగా చర్చించారు. కాలనీలు అందరికీ ఆదర్శంగా ఉండాలని మురికివాడలుగా కనిపించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కాలనీల రూపకల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణాలకు సకాలంలో నిధులు విడుదలయ్యేలా అధికారులు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఏయే సమయాల్లో ఎంత నిధులు విడుదలచేయాలన్నదానిపై ఒక ప్రణాళిక వేయాలన్నారు. తొలి విడతలో 15లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని.. 83శాతం మంది లబ్ధిదారులు మూడు ఆప్షన్లలో ఏదో ఒకదానిని ఎంచుకున్నట్లు వివరించారు. మూడు ఆప్షన్లలో ఏది ఏంచుకున్నా లబ్ధిదారులకు సబ్సిడీపై సిమెంట్, స్టీల్ అందించాలని ఆదేశించారు. బయట మార్కెట్ కన్నా తక్కువ ధరకే లభిస్తున్నందన ఆ అవకాశం అందరికీ వర్తింపజేయాలని సూచించారు.

వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందాలని సీఎం జగన్‌ అన్నారు. కాలనీల్లో జనాభాకు తగినట్టుగా రోడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఉండేలా చూడాలని సూచించారు. కొత్తగా నిర్మాణం కానున్న కాలనీల్లో ప్రతి 2 వేల జనాభాకు అంగన్‌వాడీ కేంద్రం., ప్రతి 1500 నుంచి 5వేల ఇళ్లకు లైబ్రరీ అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు.

కాలనీల్లో పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పట్టణాలు, నగరాల్లో నివసించే మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ప్లాట్లు ఇచ్చే కార్యక్రమంపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, మున్సిపల్, గృహనిర్మాణ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read more:

ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. ఎన్నికలు జరిగే ఎమ్మెల్సీ స్థానిలు ఇవే..