పోలీస్‌ సిబ్బందిని అభినందించిన ఏపీ డీజీపీ.. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారన్న గౌతమ్‌ సవాంగ్‌

ప్రశాంతమైన, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్క పౌరునికి పోలీస్ శాఖ ప్రత్యేకంగా..

పోలీస్‌ సిబ్బందిని అభినందించిన ఏపీ డీజీపీ.. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారన్న గౌతమ్‌ సవాంగ్‌
K Sammaiah

|

Feb 18, 2021 | 5:22 PM

ప్రశాంతమైన, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్క పౌరునికి పోలీస్ శాఖ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతుంది. చక్కటి వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పోలీస్ శాఖకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులకు కృతజ్ఞతలు.

మొదటి, రెండు,ముడో విడత పంచాయతీ ఎన్నికలను సమర్థ వంతంగా నిర్వహించిన పోలీసు సిబ్బందిని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి వెల్లివిరిసేలా మావోయిస్ట్ ల ఎన్నికల బహిష్కరణ పిలుపును సైతం లెక్కచేయకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కుని ప్రజలు వినియోగించుకునేలా చేయగలిగాము.

ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల ఎన్నికలలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదయినప్పటికీ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 2013 ఎన్నికలతో పోలిస్తే, ఈ పర్యాయం అతి తక్కువ అల్లర్లు జరిగినట్లు,పోలీసు శాఖ అత్యంత చొరవ తీసుకొని అహర్నిశలు శ్రమించడం వల్లనే ఇది సాధ్యమైనట్లు తెలిపారు.

వృద్దులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో తమ వంతు సహాయం చేసిన పోలీసు సిబ్బంది సేవలను కొనియాడారు. 66 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు, 20 కంపెనీల CRPF బలగాలు, 41 వేల పై చిలుకు సివిల్ పోలీసులతో పాటు మొత్తం 47860 పైగా పోలీసు సిబ్బంది ని మూడో విడత ఎన్నికల్లో వినియోగించినట్లు డీజీపీ పేర్కొన్నారు.

తదుపరి జరగనున్న చివరి విడత ఎన్నికలను సైతం సమర్థవంతంగా నిర్వహించేలా ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తామని డీజీపీ తెలియచెప్పారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.

Read more:

ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. ఎన్నికలు జరిగే ఎమ్మెల్సీ స్థానిలు ఇవే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu