పుదుచ్చేరి అసెంబ్లీలో సోమవారం బల పరీక్ష, కాంగ్రెస్ కి ‘లిట్మస్ టెస్ట్!
పుదుచ్చేరి అసెంబ్లీ లో సోమవారం బల పరీక్ష జరగనుంది. అక్కడి రాజకీయ సంక్షోభం నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
పుదుచ్చేరి అసెంబ్లీ లో సోమవారం బల పరీక్ష జరగనుంది. అక్కడి రాజకీయ సంక్షోభం నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నలుగురు సభ్యుల రాజీనామాలతో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన సంగతి విదితమే.. ముఖ్యంగా సీఎం నారాయణస్వామికి అత్యంత సన్నిహితుడైన మల్లాడి కృష్ణారావుతో సహా మరోముగ్గురు రాజీనామా చేశారు. 30 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ బలం ఒక్కసారిగా తగ్గింది. ఈ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్రం అర్ధాంతరంగా తొలగించింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కి గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
వచ్చే సోమవారం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కొంటుందని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు ఫ్లోర్ టెస్ట్ అవసరమని ఆమె అన్నారు. ఇలా ఉండగా నలుగురు సభ్యుల రాజీనామాలతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని వార్తలు వఛ్చినప్పటికీ సీఎం నారాయణస్వామి తిరస్కరించారు. తమ ప్రభుత్వం మెజారిటీలోనే ఉందన్నారు. నలుగురి రాజీనామాల అనంతరం అసెంబ్లీలో పాలక, ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 14 చొప్పున ఉంది.
మరిన్ని చదవండి ఇక్కడ :
video :ఆస్తికోసం ఆ నలుగురు కూతుర్లు చేసిన దారుణం.. జనగామ జిల్లా ,పాలకుర్తిలో అమానవీయ ఘటన.