Advocates Murder: న్యాయవాది దంపతుల హత్య కేసులో ముగ్గురు అరెస్టు.. కీలక విషయాలు వెల్లడించిన ఐజీ నాగిరెడ్డి

 Advocates Murder:  పెద్దపల్లిలో సంచలనం సృష్టించిన న్యాయవాదుల హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం...

Advocates Murder: న్యాయవాది దంపతుల హత్య కేసులో ముగ్గురు అరెస్టు.. కీలక విషయాలు వెల్లడించిన ఐజీ నాగిరెడ్డి
Follow us
Subhash Goud

|

Updated on: Feb 18, 2021 | 9:51 PM

Advocates Murder:  పెద్దపల్లిలో సంచలనం సృష్టించిన న్యాయవాదుల హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసుకు సంబంధించి పలు వివరాలు వెల్లడించారు. ఈ ఉదయం మహారాష్ట్ర సరిహద్దులో నిందితులు కుంట శ్రీను, శివందుల చిరంజీవిని, ఆ తర్వాత వారికి సహకరించిన అక్కపాక కుమార్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో 24 గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

న్యాయవాది వామన్‌రావు, కుంట శ్రీనుది గుంజపడుగు గ్రామం. గ్రామంలో వీరిద్దరి మధ్య చాలా రోజులుగా వివాదాలు కొనసాగుతున్నాయి. న్యాయపరంగా శ్రీనుని వామన్‌రావు గట్టిగా ఎదుర్కొంటున్నారు. దానిని తట్టుకోలేక వామన్‌రావును హత్య చేయాలని శ్రీను నిర్ణయించుకున్నట్లు తమ విచారణలో తేలినట్లు ఐజీ తెలిపారు. విచారణలో శ్రీను ఎక్కడా రాజకీయ కారణాలు చెప్పలేదని, శ్రీను, చిరంజీవి కలిసి హత్య చేశారని అన్నారు. అయితే శ్రీనుపై కొన్ని పాత కేసులు ఉన్నాయని అన్నారు. ఈ కేసులో ఏ1గా ప్రధాన నిందితుడు కుంట శ్రీను, ఏ2 శివందుల చిరంజీవి, ఏ3గా అక్కపాక కుమార్‌ను చేర్చామని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని అన్నారు. ఈ కేసు దర్యాప్తును మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని, మున్ముందు మరిన్ని ఆధారాలు సేకరిస్తామని పేర్కొన్నారు.

Also Read: కుంట శ్రీను. లాయర్ దంపతులు చనిపోతూ చెప్పిన పేరిది. రాజకీయ రచ్చకు ఇదే క్లూ. ఎవరితను.. పుట్టా మధుతో లింకేంటి..?